ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Success Story: ఎవరీ దంపతులు..? ఒకప్పుడు భార్య సంపాదన మీదే ఆధారపడిన భర్త.. ఇప్పుడు ఏకంగా రూ.19 వేల కోట్ల ఆస్తి..!

ABN, First Publish Date - 2023-09-06T17:33:06+05:30

వారిద్దరూ కలిసి చదువుకున్నారు.. అహ్మదాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో క్లాస్‌మేట్స్.. తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ మంచి కంపెనీల్లో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు.. అయితే ఆ యువకుడికి ఉద్యోగం చేయడం నచ్చలేదు.. దాంతో ఉద్యోగం మానేసి ఓ చిన్న కంపెనీ ప్రారంభించాడు..

వారిద్దరూ కలిసి చదువుకున్నారు.. అహ్మదాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ (IIM Ahmedabad)లో క్లాస్‌మేట్స్.. తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ మంచి కంపెనీల్లో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు.. అయితే ఆ యువకుడికి ఉద్యోగం చేయడం నచ్చలేదు.. దాంతో ఉద్యోగం మానేసి ఓ చిన్న కంపెనీ ప్రారంభించాడు.. ఎన్నో సంవత్సరాలు సంపాదన లేకుండా గడిపాడు.. భార్య జీతం మీదనే కుటుంబం నడిచేది.. ఆ తర్వాత అతను స్థాపించిన కంపెనీ విజయవంతమై ఏకంగా రూ. 57 వేల కోట్ల సంస్థగా అవతరించింది.. ఆ వ్యక్తి సంపద ఏకంగా రూ.19 వేల కోట్లకు చేరింది.. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఇన్ఫో‌ఎడ్జ్ (Info Edge) కంపెనీ వ్యవస్థాపకుడు సంజీవ్ (Sanjeev Bikhchandani).

ఐఐఎమ్‌లో కలిసి చదువుకున్న సంజీవ్, సురభి (Surabhi Bikhchandani) 1990లో వివాహం చేసుకున్నారు. చదువు తర్వాత ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. అయితే సంజీవ్ ఆ ఉద్యోగంలో కొనసాగలేకపోయాడు. వ్యాపార రంగంలో ఎదగాలనేది అతడి కల. దీంతో ఉద్యోగం మానేసి తన ఇంటి గ్యారేజ్‌లో సెకెండ్ హ్యాండ్ కంప్యూటర్లు, ఫర్నిచర్‌తో ``ఇన్ఫో‌ఎడ్జ్`` సంస్థను స్థాపించాడు. 6 సంవత్సరాలు సంపాదన లేకుండా గడిపాడు. ఆ సమయంలో సురభి సంపాదనతోనే ఇల్లు గడిచింది. 1997లో నౌకరీ.కామ్‌‌ (Naukri.com)ను ప్రారంభించిన తర్వాత సంజీవ్ దశ తిరిగింది. నౌకరీ.కామ్‌‌ సూపర్ సక్సెస్ అయింది (Success Story).

ఆ విజయంతో సంజీవ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత జీవన్‌సాథీ.కామ్, 99ఏకర్స్.కామ్, శిక్ష.కామ్‌లను ప్రారంభించి సక్సెస్ చేశారు. ఆ తర్వాత సంజీవ్ ``ఇన్ఫో‌ఎడ్జ్`` సంస్థ ``జొమాటో``, (Zomato) ``పాలసీ బజార్`` (Policy Bazaar)వంటి స్టార్టప్‌ల్లో పెట్టుబడి పెట్టి భారీ లాభాలు ఆర్జించింది. ప్రస్తుతం ``ఇన్ఫో‌ఎడ్జ్`` మార్కెట్ క్యాపిటల్ రూ.57,500 కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం సంజీవ్ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.19 వేల కోట్లు. సురభి వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.920 కోట్లు.

Updated Date - 2023-09-06T17:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising