Wife-Husband: శోభనం గదిలో భర్త వింత నిర్వాకం.. ఛీ కొట్టి పుట్టింటికి వెళ్లిన భార్య.. పోలీసుల వద్దకు పంచాయితీ.. చివరకు..!
ABN, First Publish Date - 2023-09-27T15:27:24+05:30
ఆ మహిళకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది.. ఆమె ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది.. శోభనం రోజు రాత్రి భర్త ప్రవర్తన చూసి షాకైంది.. శృంగారం పట్ల భర్త తీరు చూసి నివ్వరపోయింది.. తర్వాత పరిస్థితి మారుతుందిలే అనుకుంది.. అయితే రోజు రోజుకూ భర్త ప్రవర్తన ఆమెకు జుగుప్స కలిగించింది.
ఆ మహిళకు మూడు నెలల క్రితమే వివాహం (Marriage) జరిగింది.. ఆమె ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది.. శోభనం రోజు రాత్రి భర్త ప్రవర్తన చూసి షాకైంది.. శృంగారం పట్ల భర్త తీరు చూసి నివ్వెరపోయింది.. తర్వాత పరిస్థితి మారుతుందిలే అనుకుంది.. అయితే రోజు రోజుకూ భర్త ప్రవర్తన ఆమెకు జుగుప్స కలిగించింది.. ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి చూసింది.. అయినా అతడు మారకపోవడంతో భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది.
ఆగ్రా (Agra)లోని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌లో ఓ విచిత్రమైన కేసు నమోదైంది. ఓ మహిళ తన భర్త (Husband)పై ఫిర్యాదు చేసింది. ఆ మహిళకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. వివాహం తర్వాత మొదటి రాత్రి శోభనం గదిలో భర్త వింతగా ప్రవర్తించాడు. మొబైల్ ఫోన్‌లోని పోర్న్ వీడియోలు చూస్తూ శృంగారం సాగించాడు. ఆ వీడియోలు చూడాలని భార్యను కూడా బలవంతం చేశాడు. షాకైన మహిళ అలాగే చేసింది. తర్వాత పరిస్థితి మారుతుంది అనుకుంది. కానీ, ప్రతిరోజూ రకరకాల పోర్న్ వీడియోలు చూపిస్తూ అందులో ఉన్నట్టు చేయాలని భార్యను బలవంతం చేయడం ప్రారంభించాడు.
Viral Video: మనం సరదాగా పేల్చే టపాసులను ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. వారు ఎలాంటి పరిస్థితుల్లో పని చేస్తున్నారంటే..
అలా వద్దని చెప్పినా అతడు వినేవాడు కాదు. అలా చేయనందుకు భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. భర్తలో మార్పు వస్తుందని మూడు నెలలు ఎదురు చూసిన మహిళ చివరకు విసిగిపోయి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు ఆ కేసును ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ జంటకు నిపుణులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
Updated Date - 2023-09-27T15:27:24+05:30 IST