ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయమూర్తే కన్నీళ్లు పెట్టుకున్న అరుదైన ఘటన.. జైల్లో భర్త.. ఏడాది కూతురిని తాకట్టు పెట్టిన భార్య.. అప్పంతా తీర్చేసింది కానీ..

ABN, First Publish Date - 2023-02-15T18:57:26+05:30

సంపాదించే వ్యక్తి లేకపోవడంతో ఆ మహిళకు, ఏడాది కూతురికి తిండి తినడమే కష్టంగా మారింది. పైగా, అప్పులు తీర్చాలని అప్పులు వాళ్లు రోజూ ఇంటికి వస్తున్నారు. దీంతో చేసేదేం లేక ఆ మహిళ తన కూతురిని ఓ మహిళకు తాకట్టు పెట్టింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవత్వానికే మాయని మచ్చ లాంటి కేసు బాంబే హైకోర్టులో (Bombay High Court) విచారణకు వచ్చింది. ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తే బాధతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఉదంతం మానవాళికే సిగ్గు చేటని, విషయం పరిశీలించిన తర్వాత తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు.

మహారాష్ట్రకు (Maharashtra) చెందిన ఓ మహిళ భర్త ఓ కేసులో జైలుకు వెళ్లాడు. సంపాదించే వ్యక్తి లేకపోవడంతో ఆ మహిళకు, ఏడాది కూతురికి తిండి తినడమే కష్టంగా మారింది. పైగా, అప్పులు తీర్చాలని అప్పులు వాళ్లు రోజూ ఇంటికి వస్తున్నారు. దీంతో చేసేదేం లేక ఆ మహిళ తన కూతురిని ఓ మహిళకు తాకట్టు పెట్టింది (Woman mortgaged her daughter). ఆ డబ్బు తీసుకుని అప్పు తీర్చేసింది. తర్వాత కూలి పనులు చేసి మెల్లి మెల్లిగా డబ్బు సంపాదించి తన కూతురిని తీసుకున్న మహిళ బాకీ కూడా తీర్చేసింది. అయితే బాకీ మొత్తం వసూలు చేసుకున్న మహిళ చిన్నారిని తల్లికి అప్పగించేందుకు నిరాకరించింది. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిన్నారిని కొనుగోలు చేసిన మహిళను, అమె భర్తను అదుపులోకి తీసుకున్నారు (Crime News).

తెల్లవారుజామున 4 గంటలకు నేరుగా స్టేషన్‌కు వచ్చాడో వ్యక్తి.. చేతుల నిండా రక్తపు మరకలు.. ఏమైందని పోలీసులు అడిగితే..

దిగువ కోర్టులో కేసు విచారణకు వచ్చినపుడు న్యాయమూర్తి నిందిత మహిళ భర్తకు బెయిల్ ఇచ్చారు. నిందితురాలికి మాత్రం బెయిల్ దొరకలేదు. దీంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్ఎం మోదక్ నిందితురాలికి బెయిల్ (Bail) మంజూరు చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిన్నారిని కొనుగోలు చేసిన మహిళ చాలా కర్కశంగా వ్యాహరించిందని, ఆమె చేసిన పనిని ఎవరూ అంగీకరించలేరని పేర్కొన్నారు. అయితే నిందితురాలికి కూడా ఇద్దరు పిల్లలు ఉండడంతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి నిందితురాలిని అంతకాలం జైలులో ఉంచడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-15T18:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising