ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amigos: 'కాంతారా' అంటే అర్థం తెలియలేదు, తరువాత తెలుసుకున్నాను: కళ్యాణ్ రామ్

ABN, First Publish Date - 2023-02-08T12:12:06+05:30

'బింబిసార' లో రెండు పాత్రల్లో కనిపించిన కళ్యాణ్ రామ్ ఈ 'అమిగోస్' లో మూడు పాత్రల్లో కనిపించే నున్నాడు(Tripple role). అయితే ముందుగా ఇవన్నీ అనుకున్నవి కాదని చెప్పాడు. తను 'బింబిసార' షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ 'అమిగోస్' కథ విని ఒప్పుకోవటం జరిగింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) 'బింబిసార' (Bimbisara) సినిమాతో పెద్ద విజయం సాధించి ఇప్పుడు 'అమిగోస్' (Amigos) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనికి రాజేందర్ రెడ్డి అనే అతను దర్శకుడు. 'బింబిసార' లో రెండు పాత్రల్లో కనిపించిన కళ్యాణ్ రామ్ ఈ 'అమిగోస్' లో మూడు పాత్రల్లో కనిపించే నున్నాడు(Tripple role). అయితే ముందుగా ఇవన్నీ అనుకున్నవి కాదని చెప్పాడు. తను 'బింబిసార' షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ 'అమిగోస్' కథ విని ఒప్పుకోవటం జరిగింది అని, అలాగే ఆ తరువాత 'డెవిల్' (Devil) అనే సినిమా కూడా అప్పుడే ఒప్పుకున్నా అని చెప్పాడు.

ఈ సినిమాకి 'అమిగోస్' అనే టైటిల్ అనుకున్నప్పుడు అందరికీ అర్థం అవుతుందని అనుకున్నారా అని అడిగిన ప్రశ్నకి, అతను ఇది చర్చించి పెట్టిన టైటిల్ అని చెప్పాడు. "నాకు కూడా ముందు సందేహం వచ్చింది, కానీ మా దర్శకుడు రాజేందర్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో అమిగో అన్న పదం బాగా వాడుతున్నారని చెప్పాడు. అందుకని పెట్టాము,' అని చెప్పాడు కళ్యాణ్ రామ్. టైటిల్ చాల ముఖ్యం అని సినిమాకి చెప్పుకొచ్చాడు. 'కాంతారా' అంటే ఎవరికయినా అర్థం తెలుసా, తెలీదు, నాకు కూడా తెలీదు. కాంతారా అంటే ఏంటి అని నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగాను. తరువాత దాని గురించి సర్ఫ్ చేస్తే అర్థం 'వైల్డ్ ఫారెస్ట్' అని అర్థం అయింది.

"అలాగే దర్శకుడు రాజేందర్ ఈ 'డాపుల్ గాంగర్' అనే పదం చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. అతన్ని అడిగితే చెప్పాడు, మనిషిని పోలిన మనిషులు వుంటారు కదా అని వాళ్ళని అంటారు అని. ఆ తరువాత ఈ సినిమాకి మంచి టైటిల్ పెట్టాలి అని చాలా అలోచించి ఈ 'అమిగోస్' ఫిక్స్ చేసాము. అమిగోస్ అంటే స్నేహితులు కదా, కానీ తెలుగులో అలంటి పదాలున్నవి తక్కువ, అదీకాకుండా కొంచెం ఆడ్ గా అనిపించింది. అందుకే 'అమిగోస్' అని తిట్లతే పెట్టాము. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) బ్యానర్ పేరు కూడా అమిగోస్ కదా, సినిమా చూస్తే అర్థం అవుతుంది మీకు ఆ టైటిల్ ఎందుకు పెట్టామో," అని చెప్పాడు కళ్యాణ్ రామ్.

'బింబిసార' విజయం మరికొంచెం బాధ్యతని పెంచింది అని అంటాడు కళ్యాణ్ రామ్. ఎందుకంటే ఆ విజయాని కన్నా ఇంకా పెద్ద విజయం ఆశిస్తారు కాబట్టి, మంచి కథలు, కాన్సెప్ట్స్ వున్నవి ఒప్పుకోవాలి, అలాగే పెర్ఫార్మన్స్ కూడా బాగా చెయ్యాలి, అని చెప్పాడు. తనకి లక్కీ గా అన్నీ అలంటి మంచి కథలు వస్తున్నాయని చెప్పాడు. 'అమిగోస్' లో విలయం ప్రత్యేకంగా ఎవరూ వుండరు అని, హీరో నే విలన్ ఇందులో. ముగ్గురూ ఎలా కలిశారు, విలన్ కి ఏమి కావాలి, ఎందుకు కలిశారు ఇవన్నీ ఆసక్తికరం.

Updated Date - 2023-02-08T12:12:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising