ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New Research: ఆవులు, గేదెలు రోజూ ఇస్తున్న దాని కంటే ఎక్కువగా పాలు ఇవ్వాలంటే.. ఈ చిన్న పని చేయండి చాలు..!

ABN, First Publish Date - 2023-06-26T16:10:19+05:30

మీకు లేదా మీ బంధువులకు ఆవులు, గేదెలు ఉన్నాయా? రోజూ కంటే మరిన్ని ఎక్కువ పాలు ఇస్తే బాగుణ్ను అని అనుకుంటున్నారా? సాధారణంగా ఆవులు లేదా గేదెలు పాలు ఎక్కువగా ఇవ్వాలంటే మేత ఎక్కువగా ఇవ్వాలి అంటారు. లేదా ఇంజెక్షన్లు చేయించమంటారు. అయితే ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఓ వింత విషయం వెల్లడైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీకు లేదా మీ బంధువులకు ఆవులు (Cows), గేదెలు (Buffaloes) ఉన్నాయా? రోజూ కంటే మరిన్ని ఎక్కువ పాలు (Milk) ఇస్తే బాగుణ్ను అని అనుకుంటున్నారా? సాధారణంగా ఆవులు లేదా గేదెలు పాలు ఎక్కువగా ఇవ్వాలంటే మేత ఎక్కువగా ఇవ్వాలి అని చెబుతుంటారు. లేదా ఏదైనా ఇంజెక్షన్లు చేయించమంటారు. అయితే ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో (Study) ఓ వింత విషయం వెల్లడైంది. మీరు మీ ఆవులకు లేదా గేదెలకు సంగీతం (Music) వినిపిస్తే అవి పాలు ఎక్కువగా ఇస్తాయని తేలింది.

హర్యానా (Haryana)లోని కర్నాల్‌లో ఉన్న నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NDRI) ఈ పరిశోధన చేసింది. సంగీతం వినడం వల్ల మనుషులకు ఒత్తిడి తగ్గి విశ్రాంతి లభిస్తుందనే సంగతి తెలిసిందే. అదే విధంగా జంతువులలో ఒత్తడి తగ్గించడానికి కూడా సంగీతం ఉపయోగపడుతోందని ఈ పరిశోధనలో తేలింది. NDRI దాదాపు నాలుగేళ్ల పాటు వేలాది ఆవులను, గేదెలను పరీక్షించి ఈ విషయం కనుగొంది. సంగీతం జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, పాలు ఇచ్చే సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని తేలింది. ఈ పరిశోధన గురించి NDRI సీనియర్ సైంటిష్ట్ డాక్టర్ అశుతోష్ మాట్లాడారు.

Height Increasing: పొట్టిగా ఉండటంతో ఎవరూ పెళ్లిచేసుకోవడం లేదని.. రూ.66 లక్షలు ఖర్చు చేసి ఎత్తు పెంచుకున్నాడు..!

``శ్రీకృష్ణుని మురళీ స్వరాన్ని ఆవులు ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవని మన పురాణాల్లో ఉంది. ఆ విషయంపై మేం ప్రయోగం చేశాం. సంగీతం ఆవు లేదా గేదె మెదడులోని ఆక్సిటోసిన్ (Oxytocin) హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆ హార్మోన్ పాల ఉత్పత్తి పెరగడానికి దోహద పడుతుంది. అలాగే జంతువుల్లో ఒత్తిడిని తగ్గించే ఇతర ప్రక్రియలు కూడా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న అన్ని ఆవులను ఒకే చోట కట్టెయ్యకూడదు. వాటిని విశాలమైన ప్రదేశాల్లో ఉంచడం కూడా పాల ఉత్పత్తి పెరగడానికి కారణమవుతుంద``ని అశుతోష్ అన్నారు.

Updated Date - 2023-06-26T16:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising