ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Leopard Cubs: ఈ రైతు చేసిన పొరపాటును మీరెవ్వరూ చేయకండి.. సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉన్నతాధికారి విజ్ఞప్తి..

ABN, First Publish Date - 2023-07-16T16:02:25+05:30

ఇటీవల అడవిలో ఓ హర్యానా రైతుకు చిరుత పిల్లలు కనిపించిన విషయం తెలిసిందే. అవి చిరుతలను తెలియక ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తరువాత అటవీ శాఖ అధికారులు వాటికి తీసుకెళ్లిపోయారు. అయితే, ఆ రైతు తెలియక ఎంత తప్పు చేశాడో చేశాడో వివరిస్తూ ఐఎఫ్ఎస్ అధికారి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా జమానా వచ్చాక అందరికీ సెల్ఫీల జాడ్యం పట్టుకుంది. పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేతిలో కెమెరాతో సమయం, సందర్భం చూసుకోకుండా, చేస్తున్నది తప్పో రైటో అని ఆలోచించకుండా చేస్తున్న పనులు ఊహించిన సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల హరియాణాలో(Haryana) ఇదే జరిగింది.

ఇవీ చదవండి: లక్ అంటే ఇదీ..విమానం కిటికీలోంచి చూస్తే కనిపించిన చంద్రయాన్-3.. ప్రయాణికులకు గూస్‌బంప్స్!

నూహ జిల్లాకు చెందిన ఆ రైతు గొర్రెలను ఓ అడవి సమీపంలోని ప్రాంతానికి మేతకు తీసుకెళ్లాడు(Farmer takes leopard cubs home). ఇంటి కొచ్చే సమయంలో దారిలో అతడికి రెండు పిల్ల చిరుతలు కనిపించాయి. వాస్తవానికి అవేంటో అతడికి అర్థం కాలేదు. పిల్లులేమో అనుకుని ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఆ తరువాత చుట్టుపక్కల వారు వాటితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఆ నోటా ఈనోటా ఈ విషయం అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వచ్చి వాటిని తీసుకెళ్లిపోయారు. కానీ అసలు పొరపాటు అప్పటికే జరిగిపోయిందంటూ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ పలు విషయాలను నెట్టింట్లో పంచుకున్నారు(Parween kaswan suggestion).

ఇవీ చదవండి: ఇది మామూలు కోడి కాదు! పదుల సంఖ్యలో మొసళ్లు ఒక్కసారిగా ఎటాక్ చేస్తే..

రైతులు, ముఖ్యంగా అడవిలోకి వెళ్లేవారు, అక్కడ పులులు లేదా చిరుతల పిల్లలు కనబడితే వాటిని వెంట తీసుకురావద్దని హెచ్చరించారు. వాటిని చేతులతో ఏమాత్రం తాకొద్దని విజ్ఞప్తి చేశారు. వాటి కోసం తల్లి చిరుత కచ్చితంగా వెనక్కు వస్తుందని చెప్పిన ఆయన, పిల్లలపై మనుషుల వాసన ఉంటే అవి వాటిని చాలా సందర్భాల్లో చేరదీయని హెచ్చరించారు. అలాంటప్పుడు అవి అడవిలోనే చనిపోతాయని లేకపోతే వాటిని మనుషులు తీసుకొచ్చి జీవితాంతం బోన్లలో ఉంచాలని విచారం వ్యక్తం చేశారు. ఒంటరిగా ఉన్న పిల్ల జంతువులు అపాయంలో పడే అవకాశం ఉంటే వాటి చుట్టూ కంచె వేసి వచ్చేయాలని సూచించారు. పిల్ల జంతువులను పలు మార్లు కాపాడిన అనుభవంతో తానీ విషయాలను చెబుతున్నానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-16T18:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising