India Summons UK: లండన్‌లో భారత జాతీయ జెండాకు అగౌరవం.. బ్రిటన్ దౌత్యవేత్తకు సమన్లు!
ABN, First Publish Date - 2023-03-20T08:37:30+05:30
India Summons UK: లండన్‌లో భారత త్రివర్ణ పతాకానికి అగౌరవం(disrespect) ఎదురైన సంఘటన చోటుచేసుకుంది. ఖలిస్థాన్ అనుకూలవాదులు కొందరు లండన్‌లోని భారత్ హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండా(National flag)ను కిందికి దింపివేసి తీవ్ర అగౌరవ పరిచారు.
India Summons UK: లండన్‌లో భారత త్రివర్ణ పతాకానికి అగౌరవం(disrespect) ఎదురైన సంఘటన చోటుచేసుకుంది. ఖలిస్థాన్ అనుకూలవాదులు కొందరు లండన్‌లోని భారత్ హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండా(National flag)ను కిందికి దింపివేసి తీవ్ర అగౌరవ పరిచారు. ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా మండిపడింది.
ఈ మేరకు ఢిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్త(Britain's senior diplomat)కు సమన్లు కూడా జారీ చేసింది. లండన్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ పేర్కొంది. దీనికి బాధ్యులైనవారిపై వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఖలిస్థానీ(Khalistani) సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్‌పాల్ సింగ్ అనుచరులను పంజాబ్ పోలీసులు(Punjab Police) అరెస్టు చేసిన అనంతరం రెండు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గంవారు లండన్(London)లో నిరసనలు చేపట్టారు. లండన్‌లోని భారత హై కమిషన్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కిందికి దించివేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో(social media) వీడియోలు పోస్టు చేశారు. ఈ చర్యను తీవ్రమైనదిగా పరిగణించిన భారత విదేశాంగ శాఖ అక్కడకు నిరసనకారులు(Protesters) వచ్చేంతవరకూ భారత హైకమిషన్ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సమగ్రంగా వివరణ ఇవ్వాలని కోరింది.
ఇదిలావుండగా ఖలిస్థానీ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేత అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే అభియోగంపై అమృత్‌పాల్‌పై మరో కేసు కూడా నమోదైంది. ఇంతలో అమృత్‌పాల్ సింగ్ సలహాదారుడు దల్జీత్ సింగ్ కల్సి(Daljeet Singh Kalsi)తో పాటు ముగ్గురిని అరెస్టు చేసి అస్సాం(Assam)లోని దిబ్రుగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా అమృత్‌పాల్ కోసం పోలీసుల గాలింపును నిరసిస్తూ లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఖలిస్థాన్ మద్దతుదారులు(supporters) ఆందోళన చేపట్టారు.
Updated Date - 2023-03-20T08:46:19+05:30 IST