ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs China: చైనాలో షాకింగ్ పరిణామం.. భారత్‌లో ఇలా ఉంటే డ్రాగన్ దేశంలో మాత్రం సీన్ రివర్స్.. అక్కడ కుర్రాళ్లు పెళ్లి చేసుకోవాలంటే..

ABN, First Publish Date - 2023-02-28T13:00:59+05:30

భారతదేశంలో పెళ్ళికాని ప్రసాదుల కంటే చైనా కుర్రాళ్ళ బాధ చాలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం గురించి తెలియనివారు ఉండరు. పెళ్ళి చేసుకోవడానికి అబ్బాయి అమ్మాయికి ఇచ్చే డబ్బును కన్యాశుల్కంగా చెప్పేవారు. అయితే కాలక్రమేణా భారతదేశంలో దీని రూపు మారింది. ప్రస్తుతం భారతదేశంలో పెళ్ళిళ్ళు జరగాలంటే ముందు అబ్బాయి అమ్మాయిని చూస్తాడు. తరువాత అమ్మాయి చదువు, ఉద్యోగం, సంపాదన గురించి చర్చిస్తారు. అమ్మాయి బాగుందనిపిస్తే కట్నకానుకలు మాట్లాడతారు. కానీ చైనాలో రివర్స్ గా ఉంది. తొలినాళ్ళలో భారతదేశంలో సాగిన కన్యాశుల్కం సంప్రదాయం చైనాలో ఎప్పటినుండో ఉంది. అయితే అప్పుడది తూ.. తూ మంత్రంగా ఉండేది. చిన్న చిన్న బహుమాలు ఈ కన్యాశుల్కంలో అమ్మాయిలకు వెళ్ళేవి. అయితే అది ఇప్పడు విశ్వరూపం దాల్చింది. భారతదేశంలో పెళ్ళికాని ప్రసాదుల కంటే చైనా కుర్రాళ్ళ బాధ చాలా పెద్దది అంటున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అక్కడి అబ్బాయిలు కిందామీదా అవుతున్నారట. దీని గురించి వివరాలు తెలుసుకుంటే..

ఆసియా దేశాల(Asia countries)లో చైనా(China) కూడా ఒకటి. జనాభా(Population) పరంగా అగ్రస్థానంలో ఉన్న ఈ దేశంలో అబ్బాయిల పెళ్ళిళ్ళు కలగానే మిగిలిపోతున్నాయట. దీనికి కారణం అక్కడ కన్యాశుల్కం వేళ్ళూనుకుపోయి విశ్వరూపం నుండి వికృతరూపం దాల్చడమే.. చైనాలో పెళ్ళికి ముందే అమ్మాయి ధర నిర్ణయించేస్తారు. మొదట అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి తన ధర చెబుతాడు. ఆ తరువాత వారి మధ్య బేరం జరుగుతుంది. కాగా ప్రస్తుతం అక్కడ అమ్మాయిల ధర ఆకాశాన్నంటుతోంది. మరీ ముఖ్యంగా గత ఏడాది చైనా ప్రభుత్వం కన్యాశుల్కం విషయంలో అమ్మాయిల నిర్ణయమే ఫైనల్ అని చెప్పడంతో తమకు కావాల్సిన కన్యాశుల్కం చెప్పే స్వేచ్చ ఇప్పుడు అమ్మాయిల చేతుల్లోనే ఉంది. దీని కారణంగా అక్కడ అబ్బాయిలు పెద్ద చిక్కుల్లో పడ్డారు.

Read also: Weird Law: అమ్మ బాబోయ్ ఇదేం చట్టం.. ఎదుటి వారికి కోపం తెప్పించినా జైల్లో వేస్తారట.. ఈ వింత రూల్ ఎక్కడంటే..?


గ్రామీణ ప్రాంతాలలో ఉంటూ పెద్ద ఉద్యోగాలు లేని అబ్బాయిలు అమ్మాయిలు అడిగినంత కన్యాశుల్కం ఇచ్చుకోలేక, అటు పెళ్ళిళ్ళు కాక, బ్యాచిలర్స్ గానే మిగిలిపోతున్నారు. కన్యాశుల్కం చైనా సంప్రదాయంలో భాగంగానే ఉండటంతో దాన్ని వ్యతిరేకించలేని పరిస్థితిలో అక్కడి వ్యవస్థ ఉంది. క్రీ.పూ. నుంచే ఈ కన్యాశుల్క సంప్రదాయం ఉంది, దీన్ని చైనా బాషలో పిన్లీ లేదా పించై అని పిలుస్తారు. ప్రస్తుతం అయితే చైనాలో అమ్మాయిలకు ఇవ్వాల్సిన కన్యాశుల్కం 12నుండి 18లక్షలు ఉంది. చదువుతుకున్న కుటుంబాలలో అయితే ఇది 21.5లక్షల నుండి 36లక్షలు. కాగా ఓ వధువు కోటిరూపాయల కన్యాశుల్కం డిమాండ్ చేసి వార్తల్లో నిలిచింది కూడా. ఇంత బీభత్సంగా కన్యాశుల్కం డిమాండ్ చేస్తుండటంతో చైనా కుర్రాళ్ళు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. దీని గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుండటంతో కన్యాశుల్కం విషయంలో చట్టం చేసే ఆలోచనలో చైనా ప్రభుత్వం ఉంది. అక్కడి సంప్రదాయం ఇక్కడికీ వస్తే ఏంటి దేవుడా మా పరిస్థితి అని మన కుర్రాళ్ళు లోలోపల మధన పడుతున్నారిప్పుడు.

Updated Date - 2023-02-28T13:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!