హఠాత్తుగా ఏ ఊరికైనా వెళ్లాలా? ట్రైన్ టిక్కెట్ బుక్ అవుతుందో లేదో తెలియదా? అయితే ‘వికల్ప్’ మీ సమస్యను చిటికెలో పరిష్కరిస్తుందిలా...
ABN, First Publish Date - 2023-04-22T10:25:47+05:30
ఒక్కోసారి అనుకోకుండా అర్జెంటుగా ప్రయాణాలు సాగించాల్సిస్తుంటుంది. అటువంటప్పుడు ప్రయాణసాధనాలేవీ అందుబాటులో ఉండవు. దీనిని గుర్తించిన రైల్వేశాఖ ఒక పథకాన్ని అమలు చేస్తోంది.
ఒక్కోసారి అనుకోకుండా అర్జెంటుగా ప్రయాణాలు సాగించాల్సిస్తుంటుంది. అటువంటప్పుడు ప్రయాణసాధనాలేవీ అందుబాటులో ఉండవు. దీనిని గుర్తించిన రైల్వేశాఖ ఒక పథకాన్ని అమలు చేస్తోంది.
ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వేశాఖ(Department of Railways) 2015లో VIKALP అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో వెయింటింగ్ టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో.. కన్ఫర్మ్ టిక్కెట్ (Confirm ticket)పొందేందుకు మరొక రైలును ఎంచుకునే సౌకర్యాన్ని పొందుతారు. ఇలా చేయడం వల్ల కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం మరింతగా పెరుగుతుంది. దీనిని ఆల్టర్నేట్ ట్రైన్ అకామోడేషన్ స్కీమ్ (Alternate Train Accommodation Scheme) అని కూడా అంటారు.
దీని ద్వారా రైల్వేశాఖ గరిష్ట సంఖ్యలో ప్రయాణికులకు ధృవీకరణ పొందిన టిక్కెట్లను అందిస్తుంది. వికల్ప్ టిక్కెట్ బుకింగ్ పథకం(Vikalp Ticket Booking Scheme) పండుగలు లేదా ఇతర రద్దీ సందర్భాలలో ప్రయాణీకులు ధృవీకరణ పొందిన టిక్కెట్‌లను దక్కించుకునే అవకాశాలను బాగా పెంచుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ధృవీకరణ పొందిన టిక్కెట్‌ను పొందగలరా లేదా అనేది రైలు. వాటిలోని బెర్త్‌ల(berths) లభ్యతపై ఆధారపడి ఉంటుంది. మీరు Vikalp పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, IRCTC వెబ్‌సైట్‌లో టిక్కెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు మీరు రైలులో సీట్ల లభ్యత స్థితిని తనిఖీ చేయవచ్చు.
రైలులో సీటు అందుబాటులో లేకుంటే లేదా వెయిటింగ్ లిస్ట్(Waiting list) ఉంటే మీరు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సమయంలో VIKALPని ఎంచుకోవాలి. దీని తర్వాత IRCTC మీకు నచ్చిన ఇతర రైళ్ల గురించి అడుగుతుంది, వీటిలో మీరు 7 రైళ్లను ఎంచుకోవచ్చు. తరువాత మీరు ఎంచుకున్న రైళ్లలో ధృవీకరించిన టిక్కెట్లను బుక్ చేయడానికి రైల్వేశాఖ(Department of Railways) ప్రయత్నిస్తుంది.
Updated Date - 2023-04-22T10:31:51+05:30 IST