Viral: ఎంత పనిచేశావమ్మా.. భర్తతో అబద్ధం చెప్పి పాకిస్తాన్‌కు పయనం.. అసలు నిజం తెలిసి భార్యకు ఫోన్ చేస్తే..!
ABN, First Publish Date - 2023-07-24T18:32:52+05:30
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కలకలం సద్దుమణగక మునుపే మరో షాకింగ్ ఉదంతం వేలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కలకలం సద్దుమణగక మునుపే మరో షాకింగ్ ఉదంతం వేలుగులోకి వచ్చింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు భారతీయ మహిళ(Indian woman) భర్తకు చెప్పకుండా ఏకంగా సరిహద్దు దాటేసింది. రాజస్థాన్‌కు(rajasthan) చెందిన అంజూకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే, భర్త సాయంతో ఆమె 2020లో పాస్‌పోర్టు తీసుకుంది. ఇటీవల ఆమె ఫేస్బుక్లో నస్రుల్లా పరిచయమయ్యాడు. దీంతో, ఆమె గురువారం జైపూర్‌కు వెళుతున్నానని భర్తకు చెప్పి బయలుదేరింది. ఆదివారం మరోసారి ఫోన్ చేసి పాకిస్థాన్‌లో ఉన్నానని చెప్పడంతో భర్తకు దిమ్మతిరిగింది(Pakistani facebook friend). కొద్ది రోజుల్లో మళ్లీ వస్తానని ఆమె భర్తకు భరోసా ఇచ్చింది.
ఇదిలా ఉంటే, పాకిస్థాన్‌లో దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె డాక్యుమెంట్లు అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్‌లోని ఖైబర్ పాఖ్తూన్ఖ్వాలో(Khyber Pakhthunkhwa) ఉంటోంది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందుగానే వారిద్దరికీ భద్రత కల్పించారు. మరోవైపు, భార్య ఫేస్బుక్ పరిచయం గురించి తనకు తెలుసని భర్త చెప్పుకొచ్చాడు. ఆమె మళ్లీ భారత్‌కు తిరిగొస్తుందని ఆశిస్తున్న పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే, అంజూ ఉదంతం భారత్‌లో కలకలం రేపుతుండటం గుర్తించి నస్రుల్లా స్పందించాడు. తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆమె తన కుటుంబంలోని మహిళలతో కలిసి మరో గదిలో ఉంటోందని చెప్పారు. ఆమె వీసా ఆగస్టు 20న మిగిసాక భారత్‌కు వస్తుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.
Updated Date - 2023-07-24T18:32:55+05:30 IST