ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nandamuri Balakrishna: వాళ్ళ పేర్లు చెప్పుకొని ఎంతకాలం...

ABN, First Publish Date - 2023-02-08T14:31:02+05:30

శివవేద సినిమా గురించి మాట్లాడుతూ బాలకృష్ణ, ముందుగా తన తండ్రి ఎన్టీఆర్ అలాగే శివ రాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ లను తలుచుకున్నారు. వాళ్ళు మహానుభావులని, గొప్ప నటులను ప్రశంసిస్తూనే తమ అదృష్టం వాళ్ళకి పుట్టడం అలాగే, వాళ్ళ అదృష్టం కూడా మేము వారి వారసులముగా పుట్టడం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రత్యేక అతిధిగా శివవేద (Shiva Vedha) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. ఇందులో కన్నడ లెజెండరీ నటుడు రాజ్ కుమార్ (Raj Kumar) తనయుడు శివరాజ్ కుమార్ (Shiv Raj Kumar) కథానాయకుడు కాగా హర్ష దర్శకుడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ బాలకృష్ణ, ముందుగా తన తండ్రి ఎన్టీఆర్ (NTR) అలాగే శివ రాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ లను తలుచుకున్నారు. వాళ్ళు మహానుభావులని, గొప్ప నటులను ప్రశంసిస్తూనే తమ అదృష్టం వాళ్ళకి పుట్టడం అలాగే, వాళ్ళ అదృష్టం కూడా మేము వారి వారసులముగా పుట్టడం అన్నారు.

ఎందుకంటే వారసత్వం అనేది ఒక బాధ్యత అని అన్నారు బాలకృష్ణ. వాళ్ళ పేర్లు చెప్పుకొని ఎంతో కాలం ఉండలేమని, ఒకటి రెండు సినిమాలకే బాగుంటుంది అని, అయితే ఆ తరువాత మేము కూడా మాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని అన్నారు. వారసత్వం అంటే భాద్యత తో పాటు రక్తం కూడా అని, అటువంటి మహానుభావుల పెంపకంలో, పోషణలో రాటు దేలాలని అన్నారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచు కున్నప్పుడే ఆ నట జీవితానికి ఒక సార్ధకం, అర్థం ఉంటుందని అదే వారసత్వం అని చెప్పారు బాలకృష్ణ.

రాజ్ కుమార్ కుటుంబం, నందమూరి కుటుంబం ఒక్కటే అని చెపుతూ దివంగత పునీత్ (Puneeth Raj Kumar) గురించి మాట్లాడుతూ ఎన్నో మంచి పనులు చేశాడు అతను. మనం చిన్న పని చేసిన ఎదో ఆర్భాటంగా చేస్తాం, అలాంటిది పునీత్ ఎన్నో సాంఘీక సంక్షేమ కార్యక్రమాలు చేసి శారీరకంగా మన మధ్య లేకపోయినా తను చేసిన పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వుండేటట్టు చేసాడు. 'వేద' సినిమా చాలా బాగుంది అని బాలకృష్ణ చెప్పాడు. సినిమాటో గ్రాఫర్ విజువల్స్ బాగున్నాయి. ఒక సినిమాను హిట్ చేయాలన్నా, ఫట్ చేయాలన్నా, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ మరియు టెక్నిషియన్స్ చేతిలో ఉంటుంది. అయితే ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఎడిటర్ చాలా బాగా చేశాడు. ఇందులో చాలా మంది సీనియర్ నటులు నటించారు. కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.

Updated Date - 2023-02-08T14:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising