Plastic Effect: ప్లాస్టిక్ బాక్స్‌లో ఆహారం నిల్వచేస్తున్నారా?. వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్‌దేనా?.. మరి ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా
ABN, First Publish Date - 2023-06-06T16:35:48+05:30
‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యం -పరిష్కారం అనే థీమ్‌తో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తరచుగా మనం ఇళ్లలో ఉపయోగించే హానికరమైన కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి అంటున్నారు. అవేంటో చూద్దాం..
మన చుట్టూ ఉన్న పరిసరాలను ఒకసారి పరిశీలించండి. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్(Plastic)తో నిండిపోయి ఉంటుంది. అంతేకాదు ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం కూడా ఎక్కువై పోయింది. దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరగడంతో అనేక ప్రాణాంతకమైన వ్యాధులు బారిన పడుతున్నారు. అటువంటి హానికరమైన ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని వెంటనే నిలిపివేస్తే మంచిదని, ప్లాస్టిక్ వాడకంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతియేటా పర్యావరణంపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈసారి ‘‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day 2023) సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యం -పరిష్కారం(Solutions to Plastic Pollution) అనే థీమ్‌తో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తరచుగా మనం ఇళ్లలో ఉపయోగించే హానికరమైన ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో చూద్దాం..
వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా నీరు ఎక్కువగా తాగుతుంటాం. అలాంటి పరిస్థితుల్లో నూటికి 80 శాతం మంది వారి ఇండ్లలో నీటిని ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగుతుంటారు. ఈ ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బైస్పెనోల్ ((Bisphenol A (BPA) అనే రసాయనాన్ని ఉపయోగిస్తుంటారు. దీని వాడకం వల్ల క్యాన్సర్ (Risk of Cancer), హార్మోన్ల సమస్యల ( Hormonal Problems) బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిస్తే చాలామంచిది అంటున్నారు నిపుణులు.
ప్లాస్టిక్ కంటైనర్లు(Plastic Containers)
ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో ఉపయోగించే బైస్పెనోల్(Bisphenol A (BPA) అనే రసాయనం ఈ ప్లాస్టిక్ కంటైనర్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అలాంటి పరిస్థితుల్లో వాటిలో నిల్వ ఉంచే పదార్థాలు కలుషితమై వాటిని తిన్నపుడు మన శరీరానికి హానీ కలిగిస్తాయి. అందుకే ప్లాస్టిక్ కంటైనర్ల వాడకాన్ని తగ్గించి స్టీల్, గ్లాసు వస్తువులు వినియోగించాలి.
ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు (Plastic chopping board)
మీరు ఇండ్లలో కూరగాయలు కట్ చేసేందుకు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు ఉపయోగిస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి. ప్లాస్టిక్ బోర్డులో హానికరమైన ఎలిమెంట్ ఉంటాయి. కూరగాయాల కట్ చేస్తున్నపుడు వాటిలో కలిసిపోతాయి. ఇది రోగాలకు దారితీస్తుంది. అంతేకాదు హానికరమైన బ్యాక్టీరియా పెరిగి కడుపునొప్పి సంబంధిత వ్యాధులను పెంచుతుంది.
Updated Date - 2023-06-06T16:44:05+05:30 IST