Salman Khan: ఆమిర్ ఖాన్‌తో సినిమా చేయనున్న సల్మాన్!

ABN, First Publish Date - 2023-02-02T17:00:23+05:30

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను నటులు సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఇద్దరు మంచి స్నేహితులు. మూడు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికి ‘అందాజ్ అప్నా అప్నా’ (Andaz Apna Apna) అనే కామెడీ చిత్రం మాత్రమే చేశారు.

Salman Khan: ఆమిర్ ఖాన్‌తో సినిమా చేయనున్న సల్మాన్!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను నటులు సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఇద్దరు మంచి స్నేహితులు. మూడు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికి ‘అందాజ్ అప్నా అప్నా’ (Andaz Apna Apna) అనే కామెడీ చిత్రం మాత్రమే చేశారు. ఈ మూవీ 1994లో విడుదలైంది. తర్వాత ఇద్దరు కలసి ఏ సినిమా చేయలేదు. కొన్ని రోజుల క్రితం ఆమిర్ ఇంటిని సల్మాన్ ఖాన్ సందర్శించాడు. అప్పటి నుంచి వీరిద్దరు కలసి సినిమా చేయనున్నారని ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ రూమర్స్‌పై తాజాగా క్లారిటీ వచ్చింది. అదేంటంటే..

ఆమిర్, సల్మాన్ కలసి సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. కానీ, ట్విస్టేంటే వీరిద్దరు హీరోలుగా మూవీ చేయడం లేదు. ఒకరు నిర్మిస్తున్న చిత్రంలో మరొకరు నటించనున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఆమిర్ ఖాన్ ‘ఛాంపియన్స్’ అనే మూవీని రీమేక్ చేయాలనుకున్నాడు. పూర్తి స్థాయిలో స్క్రిఫ్ట్‌ను కూడా సిద్ధం చేశాడు. కానీ, ‘లాల్ సింగ్ చడ్డా’ పరాజయం కావడంతో ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. ఈ స్క్రిఫ్ట్ సల్మాన్ ఖాన్‌కు అయితే సరిగ్గా సరిపోతుందని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ భావించాడు. సినిమాలో నటించాలని కోరాడు. తానే నిర్మిస్తానని చెప్పాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కూడా మూవీ చేసేందుకు ఆసక్తి చూపించినట్టు సమాచారం. నెల రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సల్లూ భాయ్ చెప్పినట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఆమిర్ ఖాన్ నిర్మించే సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్‌ఎస్. ప్రసన్న (RS Prasanna) దర్శకత్వం వహించనున్నాడు.

Updated Date - 2023-02-02T17:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising