ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Baby Movie Analysis: లవ్ ఫెయిల్ అయితే ఇక అంతేనా..? బేబీ సినిమాలో హీరో ఈ 5 మార్గాల్లో ఏ ఒక్కటి ప్రయత్నించినా..!

ABN, First Publish Date - 2023-07-20T14:20:23+05:30

ప్రేమలో విఫలం కావడం మరో ప్రేమలో విజయాన్ని పొందేందుకేనని గ్రహిస్తే..

painful experiences

హీరోయిన్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది.. కానీ హీరోయేమో గతాన్నే గుర్తు చేసుకుంటూ, మొదటి ప్రేమను మర్చిపోలేక మద్యపానానికి బానిసగా మారిపోతాడు. ‘నీ చిరునవ్వుకు కొదవ వస్తే.. నా సమాధి కూడా కుదవపెడతా.. అంటూ ప్రేమలో పడిన కొత్తలో తన ఆటో వెనుక రాసుకునే హీరో కాస్తా.. క్లైమాక్స్‌లో ‘అమ్మాయిల చేతిలో చితికిపోవడం కంటే.. చచ్చి చితి కి పోవడం మేలు..’ అంటూ చితికిపోయిన తన బతుకునే సజీవ సాక్ష్యంగా చూపిస్తాడు. అయితే ప్రేమలో పడితే ఇలా మద్యానికి బానిసగా మారిపోయి.. ఒంటరి జీవితాన్ని అనుభవించాల్సిందేనా..? అన్నిటికీ దూరం కావాల్సిందేనా..? హీరోకంటూ భవిష్యత్తు ఉండదా..? ఒక్కసారి ప్రేమలో ఫెయిల్ అయితే జీవితం నాశనం అయినట్టేనా..? అన్నది కొందరి నుంచి వస్తున్న విమర్శ. అసలు బ్రేకప్ అయిన వాళ్లు, ప్రేమలో పడి మోసపోయిన వాళ్లు ఏం చేస్తే త్వరగా కోలుకుంటారన్నది మానసిక నిపుణులు కొన్ని అమూల్యమైన సూచనలు ఇచ్చారు కూడా. వాటిని కనుక పాటిస్తే.. ప్రేమ చేసిన గాయాలను సులభంగా మర్చిపోవచ్చట.. ఆ సలహాలు ఏంటో.. బ్రేకప్ అయిన వాళ్లు పాటించాల్సిన చిట్కాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

1. గతాన్ని వదిలేయండి: ప్రేమలో విఫలం కావడం, లేదా విడిపోవడం అనేది ప్రతి ఒక్కరికీ కాకపోయినా కొందరి జీవితాల్లో జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రేమను దక్కించుకోవడం అనేది ఇద్దరి మనసుల మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమలో మోసపోతే, ఆ వ్యక్తిని నమ్మి చేరదీయడం అనవసరం. ఒకసారి మోసగిస్తే ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ మోసగిస్తూనే ఉంటారు. కనుక ఆ ప్రేమను వదులుకుని, వాళ్ళతో గతాన్ని మరిచిపోవడమే మంచి నిర్ణయం. నిజమైన భవిష్యత్తుకు మార్గం వేసుకుని ముందుకు సాగడమే నయం.

2. సహనం, విశ్వాసం రెండూ ఉండాలి : ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఒకరి చేయి ఒకరు విడిచి పెట్టకుండా ఉండగలగాలి. అదే ప్రేమ దక్కని నాడు మోసపోయామనే నిజాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. లేదంటే బాధ మరింత పెరుగుతుంది. వారినే తలచుకుని బాధలో మీరుంటే, మీరు ప్రేమించిన వాళ్ళేమో మరొకరితో నవ్వుతూ బతికేస్తూంటారు. కాబట్టి ద్రోహం చేసిన వ్యక్తిపై విలువైన సమయాన్ని, కన్నీళ్ళను ఎందుకు వృధా చేయాలి. బాధను మరిచిపోయి జీవితంలో ముందుకు నడవండి.

3. మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి: జీవితంలో, ఏదైనా చెడు జరిగినప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకుంటారు. కానీ మనం అభిమానించే వ్యక్తులు చివరి వరకూ మనల్ని ఉపయోగించుకుని వదిలేయడం కోసమే ఉన్నారని గ్రహించినప్పుడు మీ విలువను మీరు తెలుసుకునే సమయం ఇదే అనుకోండి.

4. ప్రపంచం చాలా పెద్దది: ఎవరైనా ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు అందరికంటే ముఖ్యమైన వ్యక్తులుగా అనిపిస్తారు. ప్రపంచం చాలా పెద్దది. ఒకసారి ప్రేమలో మోసపోతే జీవితం అయిపోయినట్టో, ఆగిపోయినట్టో కాదు అని గ్రహించాలి. విఫలం అయిన ప్రేమను పక్కన పెట్టి జీవితానికి కొత్త అర్థన్ని వెతుక్కోవాలి.

ఇది కూడా చదవండి: పాలిచ్చే తల్లులూ.. పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను తినొద్దు.. ఎంత ఇష్టమైన కర్రీలైనా సరే..!


5. ప్రేమ చాలాసార్లు కలగచ్చు: స్కూల్ వయసు నుంచి, జీవితం చివరికంటా చూసుకుంటే ప్రేమ అనేది కలుగుతూనే ఉంటుంది. ప్రేమించిన ప్రియురాలితో, ప్రియుడితో జీవితాన్ని పొందేవారు కొందరైనా ప్రేమలో ఓటమిని చూసి బాధలో కూరుకుపోయేవారు మరికొందరు. అయితే వీటి మధ్య నలిగిపోవడం కంటే ఒకసారి ప్రేమ విఫలం అయితే అవచ్చు. కానీ మళ్ళీ ఎప్పుడో మరొకరి రూపంలో ప్రేమ తలుపు తడుతుందనే గట్టి విశ్వాసం అవసరం.

మొదటి ప్రేమ గొప్పదే.. మరిచిపోలేనిదే.. కానీ ప్రేమ ఒకసారే కలగాలని లేదు.. ప్రేమ అనంతం, ప్రకృతి సహజం. ప్రేమలో విఫలం కావడం మరో ప్రేమలో విజయాన్ని పొందేందుకేనని గ్రహిస్తే.. బలవంతపు చావులు, జీవితాన్ని వ్యసనాల పాలు చేసుకోవడాలు, విషాదంతో నింపుకోవడాలు ఉండవని గ్రహించాలి.

ఇవీ.. బ్రేకప్ అయిన వాళ్లు పాటించాల్సిన టిప్స్.. వీటిని కనుక ఫాలో అయితే ఈజీగా ఆ బాధ నుంచి కోలుకోవచ్చు.

Updated Date - 2023-07-20T14:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising