ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral news: వ‌డ‌పావ్ రుచిచూసిన జపాన్ అంబాసీడర్.. ఆయన రియాక్షన్ ఏంటో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-06-10T16:07:57+05:30

మన దేశంలోని స్ట్రీట్ ఫుడ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందుతోంది. విభిన్నమైన రుచులతో రుచి మొగ్గలకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చే గోల్ గప్పాలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణే : మన దేశంలోని స్ట్రీట్ ఫుడ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందుతోంది. విభిన్నమైన రుచులతో రుచి మొగ్గలకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చే గోల్ గప్పాలు, నోరూరించే పావ్ భాజీలు అంటే ఇష్టపడనివారు ఉంటారా? ఈ రుచిని, అనుభూతిని ఆస్వాదించనివారు ఉంటారా? కచ్చితంగా ఉండరని చెప్పగలం. దీనికి ఉదాహరణ జపాన్ రాయబారి హిరోషి సుజుకి ఇటీవల ఇచ్చిన ట్వీట్. ఆయన తన అనుభూతిని పంచుకుంటూ భారతీయ స్ట్రీట్ ఫుడ్‌ను ప్రశంసించారు.

హిరోషీ సుజుకి మహారాష్ట్రలోని పుణేలో వడ పావ్ రుచి చూశారు. తాను ఆస్వాదించిన అనుభూతిని ఆయన ఓ ట్వీట్‌లో పంచుకున్నారు. భారత దేశంలోని స్ట్రీట్ ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అయితే కాస్త మసాలా తగ్గించాలని కోరారు.

ఈ వీడియోను చూసిన ఫుడీస్ చాలా సంతోషించారు. తమ ప్రాంతంలోని తినుబండారాలను కూడా రుచి చూసి, ఆస్వాదించాలని జపనీస్ రాయబారిని కోరారు. ‘‘హైదరాబాద్‌లో మిర్చి బజ్జీని రుచి చూడండి’’ అని ఓ ట్విటరాటీ సలహా ఇచ్చారు. ‘‘బికనీర్‌లో కచోరీని కూడా ఎంజాయ్ చెయ్యండి. ఆ తర్వాత స్వీట్ లస్సీ, లేదా, మ్యాంగో మస్తానీ తప్పనిసరి’’ అని మరొకరు చెప్పారు. సాయంత్రంవేళ చాట్ ఐటమ్స్ (పానీ పూరీ)లను తినడం మర్చిపోవద్దని చెప్పారు. బిహారీ లిట్టి చోఖాను కూడా ట్రై చేయమని మరొకరు సలహా ఇచ్చారు.

హిరోషీ ఆనందాన్ని చూసి సంతోషించిన మరో యూజర్ స్పందిస్తూ, అనేక రకాల తినుబండారాలను సూచించారు. కంపెనీ కావాలంటే తామంతా వస్తామని చెప్పారు. చన భటుర, గోల్ గప్పా, ఘేవార్, బెంగాలీ స్వీట్స్, ధోక్లా వంటివాటిని ఆరగించాలని సలహా ఇచ్చారు. ‘‘భారతీయ వంటకాల పట్ల మీరు చూపిస్తున్న అభిమానాన్ని చూసి సంతోషిస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘మీరు చాలా కూల్‌గా ఉన్నారు’’ అని మరో యూజర్ మెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి :

Donald Trump : ట్రంప్‌పై కేసు.. ఆయన ఏమేం దాచిపెట్టారంటే..

Amazon rainforest : కూలిన విమానం.. గల్లంతైన నలుగురు బాలలు.. 40 రోజుల తర్వాత సజీవంగా..

Updated Date - 2023-06-10T16:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising