Jilumol Mariet: ఎవరీ యువతి.. ఏకంగా ముఖ్యమంత్రే పిలిచి మరీ ఈ యువతికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం వెనుక పెద్ద కథే ఉంది..!
ABN, First Publish Date - 2023-12-05T12:45:06+05:30
ఈమె దృఢ సంకల్పం గొప్పది.. రెండు చేతులు లేకపోయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ దక్కించుకుంది.
జిలుమోల్ మారియట్.. కేరళకు చెందిన 32ఏళ్ల ఈ మహిళ ఇప్పుడు భారత్ నే కాదు ఆసియా మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది. స్వయానా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈమెకు ఫోర్ వీల్ డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు. 'డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఏమైనా పెద్ద ఘనకార్యమా.. మహిళలు విమానాలనే నడుపుతున్నారు అలాంటిది ఫోర్ వీలర్ లైసెన్స్ పెద్ద గొప్పేం కాదు' అనిపిస్తుందేమో చాలా మందికి. కానీ మారియట్ ను ఈ ప్రపంచం గుర్తించడం వెనుక కారణం.. లోపమున్నా సరే విజయం సాధించడం. పుట్టకతోనే రెండు చేతులూ లేని మారియట్ దృఢ సంకల్పంతో ఫోర్ వీలర్ లైసెన్స్ పొందింది. ఈమె గురించి పూర్తీగా తెలుసుకుంటే..
కేరళ(Kerala) రాష్ట్రం కొచ్చిలో 32 ఏళ్ల జిలుమోల్ మారియట్ అనే మహిళ నివసిస్తోంది. ఈమెకు పుట్టుకతోనే చేతుల్లేవు. అయినా సరే దృఢ సంకల్పంతో జీవితంలో ఎదుగుతోంది. తన 7వ తరగతిలో తన తరగతి విద్యార్థులందరికంటే ముందే కంప్యూటర్ ను నేర్చుకోవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కంప్యూటర్ మీద ఇష్టం పెరిగింది. ఈ అభిరుచినే తన వృత్తిగా మార్చుకుంటూ కొచ్చిలోనే గ్రాఫిక్ ఆర్ట్ డిజైనర్(Graphic art designer) గా మారింది.
ఇది కూడా చదవండి: Viral Video: నూడుల్స్‌ను తినే అలవాటు ఉందా..? ఒక్కసారి ఈ వీడియోను చూస్తే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారేమో..!
రంగురంగుల జీవితం..
గ్రాఫిక్ తో దృశ్యాలకు కొత్త రూపు ఇచ్చినట్టు మారియట్ తన జీవితాన్ని కూడా అద్బుతంగా మలచుకుంది. లోపం తనకు లెక్క కాదని నిరూపిస్తూ స్వశక్తితో ఎదుగుతోంది. గత కొన్నేళ్శుగా ఫోర్ వీలర్ లైసెన్స్ కోసం ఆమె ప్రయత్నిస్తోంది. ఆమెకు చేతులు లేని కారణంగా లైసెన్స్ ఇవ్వడానికి అధికారులు ముందుకు రాలేదు. కానీ రెండు చేతులు లేకపోయినా సరే సిస్టమ్ ఆపరేటింగ్ నుండి తల దువ్వుకోవడం, అన్నం తినడం, ఇంటి పనులు చేసుకోవడంతో సహా తన ఇతర పనులకు మారియట్ ఎవ్వరి సహాయం తీసుకోదు. అదే విధంగానే డ్రైవింగ్ నేర్చుకుంది కానీ ఆమెకు మొదట నిరాశ ఎదురయ్యింది. అయనా సరే తన పట్టు వదల్లేదు. దాని ఫలితగానే ఆమె తన కలను నిజం చేసుకుంది. ప్రభుత్వం నిర్వహించిన డ్రైవింగ్ టెస్ట్ లో పాసయ్యి మరీ లైసెన్స్ ను దక్కించుకుంది(disable Kerala women got four wheeler license). ఈమె కలను నిజం చెయ్యడానికి కొచ్చికి చెందిన స్టార్టప్ సంస్థ Vi ఇన్నోవేషన్ కొత్త ప్రయోగం చేసింది. మారియట్ కు తగినట్టు కారు ఆపరేటింగ్ సిస్టమ్ లో మార్పు చేర్పులు చేసింది. ఆపరేటింగ్ సూచికల నుండి వైపర్లు, హెడ్ ల్యాంప్, వాయిస్ కమాండ్ మొదలైనవాటిని వాహనంలో డవలప్ చేసింది. దీంతో ఆమె ఆ వాహనాన్ని నడపడం సులువయ్యింది. కేరళ రాష్ట్ర వికలాంగ కమీషన్ కూడా మోటర్ వాహనాల శాఖతో ఆమె గురించి వివరించి సహయపడటం ఆమెకు కలిసొచ్చింది.
ఇది కూడా చదవండి: చపాతీలు, బెల్లం.. ఈ వింత కాంబినేషన్ వల్ల లాభమేంటంటే..!
వికలాంగ హక్కుల చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్యం ఆమెకు లైసెన్స్ మంజూరు చేసింది. యాదృశ్చికంగానే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆమె ఈ ఘనత సాధించడంతో పలువురి మెప్పు పొందింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Kerala CM Pinarayi Vijayan) చేతుల మీదుగా ఆమెకు లైసెన్స్ అందించారు. ఆమెను అభినందించారు. కాగా మారియట్ ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వెనుక రికార్డ్ కూడా నమోదైంది. భారత్ లోనే కాదు.. ఆసియా మొత్తం మీద చేతులు లేకపోయినా సరే ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఏకైక మహిళగా ఈమె నిలిచింది.
ఇది కూడా చదవండి: స్కూలు నుంచి తిరిగొచ్చాక పిల్లల్ని అడగాల్సిన ప్రశ్నలివీ..!
Updated Date - 2023-12-05T12:45:08+05:30 IST