ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kangana Ranaut: నన్ను వేధింపులకు గురి చేసినట్టు.. ఆయనను అవమానించడం మర్చిపోయారు..

ABN, First Publish Date - 2023-02-25T17:00:47+05:30

మలయాళంలో సంచలన విజయం సాధించిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ (Driving Licence). ఈ చిత్రం హిందీలో ‘సెల్ఫీ’ (Selfiee) టైటిల్‌తో రీమేక్ అయింది. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) హీరోలుగా నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలయాళంలో సంచలన విజయం సాధించిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ (Driving Licence). ఈ చిత్రం హిందీలో ‘సెల్ఫీ’ (Selfiee) టైటిల్‌తో రీమేక్ అయింది. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) హీరోలుగా నటించారు. రాజ్ మెహతా (Raj Mehta) దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల అయింది. ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్‌ను కంగనా రనౌత్ (Kangana Ranaut) తో పోల్చుతూ ఓ వెబ్‌సైట్ కథనం రాసింది. అక్షయ్‌ను మేల్ వెర్షన్ ఆఫ్ కంగన‌గా వర్ణించింది. ఫలితంగా కంగనా రనౌత్ ఈ వార్తపై మండి పడ్డారు. వెబ్‌సైట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కంగనా రనౌత్ నటించిన ‘ధాకడ్’ వసూళ్లతో ‘సెల్ఫీ’ ని పరోక్షంగా పోలుస్తూ వెబ్‌సైట్ కథనాన్ని రాసింది. ఈ కథనం కంగన కంట పడటంతో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘అక్షయ్‌ ఈజ్‌ ఏ మేల్‌ వెర్షన్‌ ఆఫ్‌ కంగన అనే హెడ్డింగ్‌తో ఉన్న ఈ వార్త మొత్తం నన్ను ఉద్దేశిస్తూనే రాశారు. సెల్ఫీ సినిమా ప్లాఫ్‌కు సంబంధించిన వార్తలను వెతుకుతుంటే ఈ వెబ్‌సైట్ కథనం నా కంట పడింది. ఈ చిత్రం పరాజయం కావడం నా తప్పా. కరణ్‌ జోహార్‌ (Karan Johar) సినిమా మొదటి రోజు రూ.10 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది. అయితే, నన్ను వేధింపులకు గురి చేసినట్టు ఆయన్ని తిట్టడం లేదా అవమానించడం మీడియా మర్చిపోయినట్టు ఉంది’’ అని కంగనా రనౌత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక కంగన కెరీర్ విషయానికి వస్తే.. ‘చంద్రముఖి 2’ లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె ఈ మధ్యనే మెగాఫోన్ పట్టుకున్నారు. ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి తన ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Simbu: ఎట్టకేలకు శింబు పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-25T17:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising