Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోకు నటన రాదంటూ విమర్శలు

ABN, First Publish Date - 2023-02-20T17:58:21+05:30

బాలీవుడ్‌లో‌ని టాప్ హీరోయిన్స్‌లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. సమకాలీన అంశాలు, రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్టు వెల్లడిస్తుంటారు.

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోకు నటన రాదంటూ విమర్శలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో‌ని టాప్ హీరోయిన్స్‌లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. సమకాలీన అంశాలు, రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్టు వెల్లడిస్తుంటారు. తాజాగా ఆమె బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాప్ సింగర్ దిల్జీత్ దొసాంజే (Diljit Dosanjh) పై తీవ్రమైన విమర్శలు చేశారు.

Hrithik-Roshan.jpg

కంగనా రనౌత్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అందులో భాగంగా ఓ అభిమాని.. ‘‘హృతిక్ రోషన్, దిల్జీత్ దొసాంజే లో మీ ఫేవరేట్ నటుడు ఎవరు’’ అని ఓ అభిమాని అడిగారు. అందుకు కంగన రిప్లై ఇస్తూ హృతిక్ రోషన్, దిల్జీత్ దొసాంజేలకు ఇద్దరికి నటన రాదని చెప్పారు. ‘‘ఒకరు యాక్షన్, మరొకరు మ్యూజిక్ వీడియోస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే వారిద్దరు నటిస్తుండగా నేను చూడలేదు. ఒక వేళ వారు నటిస్తే నాకు ఒక సారి చెప్పండి’’ అని కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. హృతిక్ రోషన్ 2016-17లో తనతో డేటింగ్ చేశారని కంగనా రనౌత్ గతంలో పలు మార్లు చెప్పారు. కానీ, ప్రతిసారి హృతిక్ వాటిని ఖండించారు.

కంగనా రనౌత్ ఈ మధ్యనే మెగా ఫోన్ పట్టుకున్నారు. ‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను నిర్మించడానికి తన ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2)లో నటిస్తున్నారు. నాట్యగత్తె పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన ‘చంద్రముఖి’ కీ సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది.

Updated Date - 2023-02-20T17:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising