Kangana Ranaut: షారుఖ్ సినిమాపై నటి ప్రశంసలు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2023-01-26T10:44:16+05:30

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నటుడు యాక్ట్ చేసిన చిత్రం కావడం..

Kangana Ranaut: షారుఖ్ సినిమాపై నటి ప్రశంసలు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
Kangana Ranaut
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నటుడు యాక్ట్ చేసిన చిత్రం కావడం.. ‘వార్’ (War) సినిమాతో రికార్డులు క్రియేట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు కావడంతో ఈ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని అంచనాల నడుమ ఈ మూవీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో ఈ మూవీ షారుఖ్ అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) కూడా ప్రశంసించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో కంగనాపై ఎంతోమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కంగనా తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మూవీ టీం తాజాగా పార్టీ చేసుకుంది. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘ఇది చాలా మంచిది. పఠాన్ సినిమా బావుందని విన్నాను. ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి. హిందీ సినిమాని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ ప్రయత్నించాలి’ అని చెప్పుకొచ్చింది. ‘కంగన రెండు నాలుకల ధోరణితో వ్యవహారిస్తోంది’.. ‘పఠాన్ బావుందని కంగనా చెబుతోంది. నిజమేనా? లేక బాయ్‌కాట్ చేయమని చెబుతోందా’ అంటూ పలువురు నెటజన్లు విమర్శిస్తున్నారు.

Updated Date - 2023-01-26T10:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising