ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటువంటి కుండను మీరెక్కడా చూసుండరు... ఈ కుండలో ఎంత నీరు పడుతుందో తెలిస్తే.. తెగ ఆశ్చర్యపోవడంతో పాటు..

ABN, First Publish Date - 2023-04-19T11:20:21+05:30

ప్రపంచంలోనే అతిపెద్ద కుండ(biggest pot)ను ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ మ్యూజియం(Museum)లో చూడవచ్చు. మీడియా నివేదికల ప్రకారం ఈ కుండ భారీ పరిమాణంలో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే అతిపెద్ద కుండ(biggest pot)ను ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ మ్యూజియం(Museum)లో చూడవచ్చు. మీడియా నివేదికల ప్రకారం ఈ కుండ భారీ పరిమాణంలో ఉంది. దీనిలో 2,000 లీటర్ల నీటిని నింపవచ్చు. ఈ కుండ సుమారు 40 సంవత్సరాల క్రితం నగరంలోని షేక్‌పురా(Sheikhpura) ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయటపడింది.

ఈ కుండ జైచంద్ రాజు, హర్షవర్ధన్(Harshavardhan) చక్రవర్తి సామ్రాజ్యం నాటి కాలానికి చెందినది కావచ్చని భావిస్తున్నారు, కన్నౌజ్ జిల్లాకు ఎంతో ఘనమైన చరిత్ర(history) ఉంది. ఇక్కడ జరిపేన తవ్వకాలలో అరుదైన వస్తువులు బయటపడుతుంటాయి. వీటిని చూసినవారంతా ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంటారు.

వీటిలో భారీ కుండకు ప్రత్యేక స్థానం(Special position) ఉంది. ఒకటి నుండి 3వ శతాబ్దాల మధ్య కుషాన్ రాజవంశం కాలంలో ఉనికిలో ఉన్న అతిపెద్ద కుండలలో ఈ కుండ ఒకటి. సుమారు 1500 సంవత్సరాల క్రితం తయారయిన ఈ పెద్ద కుండ ఎత్తు సుమారు 5.4 అడుగులు. వెడల్పు 4.5 అడుగులు. దీనిలో దాదాపు ఒక ట్యాంకర్(Tanker) నీటిని నింపవచ్చు.

కాగా కన్నౌజ్‌లో 50 ఏళ్లకు పైగా పురావస్తు శాఖ ఎప్పటికప్పుడు తవ్వకాలు(Excavations) జరుపుతోంది. ఇది అత్యంత పురాతన నగరం కావడంతో పలు పురాతన వస్తువులు బయటపడుతుంటాయి. ఇవి ఈ ప్రాంతపు ఘన చరిత్ర(history)ను తెలియజేస్తాయి. పలు భంగిమలలో పురాతన శివుని విగ్రహాలు(Idols of Shiva) కూడా ఇక్కడ బయల్పడ్డాయి.

Updated Date - 2023-04-19T11:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising