ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heart Breaking: ``నేను చనిపోతున్నా.. మీ నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో``.. హాస్పిటల్ బెడ్ మీద నుంచి ప్రియురాలికి లాస్ట్ కాల్..

ABN, First Publish Date - 2023-08-14T20:34:31+05:30

ఇక కొన్ని రోజుల్లో తాను చనిపోవడం ఖాయమని తెలుసుకున్న ఓ యువకుడు హాస్పిటల్ బెడ్ మీద నుంచి తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. తాను చనిపోతున్నానని, మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని చెప్పాడు. అంతేకాదు తన అంత్యక్రియలకు రావాల్సిందిగా ఆహ్వానించాడు.

ఇక కొన్ని రోజుల్లో తాను చనిపోవడం ఖాయమని తెలుసుకున్న ఓ యువకుడు హాస్పిటల్ బెడ్ మీద నుంచి తన ప్రియురాలికి (Girl Friend) వీడియో కాల్ (Video Call) చేశాడు. తాను చనిపోతున్నానని, మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని చెప్పాడు. అంతేకాదు తన అంత్యక్రియలకు (Funeral) రావాల్సిందిగా ఆహ్వానించాడు. అన్నట్టుగానే కొద్దిసేపటికి ప్రాణాలు వదిలేశాడు. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటక (Karnataka)లోని నెలమంగల అనే గ్రామంలో వెలుగు చూసింది.

నెలమంగలకు చెందిన కిరణ్ అనే యువకుడిని కొద్ది రోజుల క్రితం కుక్క (Dog bite) కరిచింది. అయితే కిరణ్ వెంటనే చికిత్స చేయించుకోలేదు. ఏం కాదులే అని నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. దీంతో కిరణ్‌కు రేబిస్ (Rabies) వ్యాధి సోకింది. ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు కిరణ్‌ను బెంగళూరు (Bengaluru)లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కిరణ్‌ను పరీక్షించిన వైద్యులు అతడు బతకడం కష్టమని తేల్చి చెప్పారు. ఇక, ఎన్నో రోజులు బతకనని తెలిసిన వెంటనే కిరణ్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు.

Pretha Kalyanam: ప్రేతాత్మలకు పెళ్లి.. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వింత ఆచారం.. 30 ఏళ్ల క్రితం చనిపోయినోళ్లు కూడా..!

తన పరిస్థితి గురించి ప్రియురాలికి చెప్పాడు. ``నేను ఇక బతకను. నా అంత్యక్రియలకు నువ్వు తప్పక రావాలి. నువ్వు మీ నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకో. నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టు`` అని కోరాడు. ఆ వీడియో కాల్ చేసిన తర్వాత కొన్ని గంటలకే కిరణ్ చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Updated Date - 2023-08-14T20:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising