ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

ABN, First Publish Date - 2023-02-21T19:26:30+05:30

తెలుగు సీరియల్స్‌లో రారాజుగా వెలిగిన సీరియల్స్‌లో ‘కార్తీకదీపం’ (Karthika Deepam) కూడా ఒకటి. ఒకప్పుడు ఈ సీరియల్ టీఆర్పీ ఇండియన్

Vantalakka Premi Viswanath

తెలుగు సీరియల్స్‌లో రారాజుగా వెలిగిన సీరియల్స్‌లో ‘కార్తీకదీపం’ (Karthika Deepam) కూడా ఒకటి. ఒకప్పుడు ఈ సీరియల్ టీఆర్పీ ఇండియన్ రికార్డ్స్‌ (Indian Records)ను బద్దలు కొట్టింది. ఈ మధ్యకాలంలో కాస్త తగ్గింది కానీ.. ఏ సీరియల్‌కి రానంతగా ‘కార్తీకదీపం’ సీరియల్ వ్యూవ‌ర్ షిప్ రాబట్టుకుంది. సోషల్ మీడియా అనే కాదు.. ఎక్కడ చూసినా డాక్టర్ బాబు (Doctor Babu), వంటలక్క (Vantalakka) అంటూ మోత మోగేది. అంతకుముందు ఏ సీరియల్ కూడా ఇలా హైలెట్ అవలేదు. ఆ ఘ‌న‌త కార్తీకదీపం దక్కించుకుంది. 2017లో ఈ సీరియల్ మొదలైంది. మొదట్లో పెద్దగా ఎవరూ ఈ సీరియల్‌ని పట్టించుకోలేదు కానీ.. తర్వాత్తర్వాత మాత్రం డాక్టర్ బాబు, వంటలక్క.. అందరి గుండెల్లో చోటు సంపాదించేశారు. దర్శకులు తమ సినిమాల్లో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలతో కామెడీని పుట్టించేంతగా ఈ సీరియల్ వైరలైంది.

ఇక ఇందులో వంటలక్క పాత్ర పేరు దీప (Deepa). ఆమె అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath). కేరళకు చెందిన ప్రేమి.. వంటలక్కగా తెలుగువారందరి ఇంట్లో స్థానం సొంతం చేసుకుంది. ఒక్క పాత్రతో ఇంతటి పాపులారిటి తెచ్చుకోవడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. అయితే ప్రేమి విశ్వనాథ్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. నేటి హీరోయిన్లు, మాజీలు అయిన రేణుదేశాయ్ (Renu Desai), స‌మంత‌ (Samantha), గౌత‌మి, సోనాలి బింద్రే, హంసానందిని ఇలా అందరూ అరుదైన వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారే. ఇప్పుడీ బ్యాచ్‌లోకి ప్రేమి కూడా చేరిందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా వారి జీవితం అంటే రంగుల మయం. పాత్రల కోసం వేసుకునే మేక‌ప్, వారిపై ప‌డే ఖ‌రీదైన లైట్ల వెలుతురు వ‌ల్ల వారు అరుదైన వ్యాధుల బారిన ప‌డుతుంటారు. కానీ కెమెరా ముందు మాత్రం వారికి ఏమీ కానట్లుగా నటనతో జీవించేస్తుంటారు.

తాజాగా వంటల‌క్క అలియాస్ ప్రేమి విశ్వ‌నాథ్‌ ముఖంపై మచ్చలు ఏర్పడ్డాయట. ఈ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటోందట. ‘కార్తీకదీపం’ సీరియ‌ల్ (Karthika Deepam Serial) కోసం ఆమె న‌ల్ల‌టి మేక‌ప్‌ని ఎక్కువ డోస్‌లో తీసుకోవడం కారణంగా ఆమె ఈ స్కిన్ సమస్యకు గురైందని అంటున్నారు. గతంలో అంటే సీరియల్ మధ్యలో కూడా ఆమె ఇటువంటి సమస్యతో బాధపడటంతో.. కొన్ని ఎపిసోడ్స్ పాటు ఆమెను దూరం పెట్టారు. ప్రస్తుతం ఆమె ఈ స్కిన్ సమస్య నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉందనేలా టాక్ వినబడుతోంది. అయితే ప్రేమి విశ్వనాథ్ మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక వంట‌లక్క‌కు అనారోగ్యమని తెలిసి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. త్వరగా ఆమె ఈ సమస్య నుండి కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా.. ఇటీవలే ‘కార్తీకదీపం’ సీరియల్‌కు ఎండ్ కార్ట్ పడగా.. త్వరలోనే పార్ట్ 2 (Karthika Deepam Part 2) ఉంటుందనేలా మేకర్స్ హింట్ ఇచ్చారు. ప్రేమి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తోన్న ‘క‌స్ట‌డీ’ (Custody) అనే చిత్రంతో వెండితెరకు కూడా పరిచయం కాబోతోంది.

ఇవి కూడా చదవండి:

Rajendra Prasad: ఇది సంస్కారవంతమైన కేటగిరీకి చెందిన సినిమా


Padmanabham Jayanti: మనల్ని కడుపుబ్బా నవ్వించిన పద్మనాభం కన్న కొడుకు చేతిలోనే..

Updated Date - 2023-02-21T19:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising