Viral News: ముగ్గురు కవల సిస్టర్స్‌ను పెళ్లాడిన వ్యక్తి.. దానికోసం మాత్రం వారికి వారాలు పంచాడు..!
ABN, First Publish Date - 2023-02-07T10:36:15+05:30
నేటి సమాజంలో బహుభార్యత్వం (Polygamy) అనేది అసాధారణమేమి కాదు.
Viral News: నేటి సమాజంలో బహుభార్యత్వం (Polygamy) అనేది అసాధారణమేమి కాదు. అయినప్పటికీ సోదరీమణులు (Sisters) ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం కొంచెం అరుదుగా జరిగే విషయం. అందులోనూ మనకు తెలిసి ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం చూశాం. అయితే, కెన్యాలో (Kenya) ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు కవల సిస్టర్స్ ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కవలలను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి వాళ్లకు పెట్టిన ఒప్పందం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెన్యాకు చెందిన కేట్, ఈవ్, మేరీ అనే ముగ్గురు కవలల్లో కేట్‌కు స్టీవో అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త కొంతకాలానికి ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు.
ఇది కూడా చదవండి: స్పెషల్ టాలెంట్.. ఇలాంటి వారు చాలా అరుదు.. ఇంకా చెప్పాలంటే 10 లక్షల మందిలో ఒకరే ఉంటారట!
ఈ క్రమంలో ఒకరోజు స్టీవ్‌ను కేట్ తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో తన మిగతా ఇద్దరు కవల సిస్టర్స్‌ను అతడికి పరిచయం చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వారిద్దరూ కూడా అతడ్ని ప్రేమించారు. దాంతో మనోడు ఆ ముగ్గురు సిస్టర్లను ఒప్పించి వారిని ఒకేసారి పెళ్లి (Marriage) చేసుకున్నాడు. ఇక పెళ్లి తర్వాత వారు నలుగురి మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పదం ప్రకారం స్టీవ్ వారికి వారాలు పంచాడు. మేరీతో సోమవారం, కేట్‌తో మంగళవారం, ఈవ్‌తో బుధవారం ఉండేలా ఒప్పందం చేసుకున్నాడు. మిగిలిన రోజుల్లో అందరూ కలిసే ఉండాలనేది వారి ఒప్పందంలోని మరో విషయం. ఇప్పుడీ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లను తమదైన శైలిలో చమత్కారాలతో కామెంట్స్ చేస్తున్నారు.
Updated Date - 2023-02-07T10:51:35+05:30 IST