ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chamayavilakku festival: పండుగ పూట.. మహిళలుగా మారిపోతున్న పురుషులు... ‘టైటిల్’ దక్కించుకున్న ఆమె/ అతనిని చూస్తే ఎవరైనా ఆలోచనలో పడాల్సిందే!

ABN, First Publish Date - 2023-03-29T09:27:24+05:30

chamayavilakku festival: సాధారణంగా సినిమాల్లో, సీరియల్స్‌లో మగవాళ్లు ఆడవారి వేషధారణ(Women's dress)తో నటించడం చూసే ఉంటాం. అయితే కేరళలో ప్రతి సంవత్సరం ఒక విచిత్రమైన పండుగ(strange festival)ను జరుపుకుంటారు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

chamayavilakku festival: సాధారణంగా సినిమాల్లో, సీరియల్స్‌లో మగవాళ్లు ఆడవారి వేషధారణ(Women's dress)తో నటించడం చూసే ఉంటాం. అయితే కేరళలో ప్రతి సంవత్సరం ఒక విచిత్రమైన పండుగ(strange festival)ను జరుపుకుంటారు, ఇందులో ఫాల్గొనే పురుషులు స్త్రీల వేషధారణతో కనిపిస్తారు. అనంతరం పురుషుల వేషధారణకు సంబంధించి పోటీ జరుగుతుంది. తాజాగా జరిగిన ఈ పోటీలో కేరళ(Kerala)కు చెందిన ఒక పురుషుడు టైటిల్(Title) దక్కించుకున్నాడు. చమయవిళక్కు అని పిలిచే ఈ ఉత్సవం కేరళలోని కొల్లాం జిల్లాలో ఉన్న కొట్టన్‌కులంగర్(Kottankulnagar) శ్రీదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది.

ఈ పండుగను మార్చి నెలలో 12 రోజులపాటు జరుపుకుంటారు. ఉత్సవం చివరి రోజున పురుషులు తమ గడ్డం, మీసాలు(Beard and moustache) తీసివేసి, స్త్రీల వస్త్రధారణ చేసుకుని, నగలు ధరిస్తారు. అద్భుతమైన మేకప్ కూడా చేసుకుంటారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇతర దక్షిణ భారత రాష్ట్రాల(South Indian states) నుండి కూడా చాలా మంది పురుషులు ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారు. విశిష్టమైన సంప్రదాయంతో ఎన్నో ఏళ్లుగా ఈ పండుగను జరుపుకుంటున్నారు.

స్త్రీ రూపాన్ని ధరించి ఆలయంలో పూజలు చేసే పురుషుల కోరికలు(wishes) నెరవేరుతాయని నమ్ముతారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ఒక జానపద కథ ప్రకారం చాలా కాలం క్రితం కొంతమంది ఆవుల కాపరులు తమకు అడవిలో దొరికిన రాయిపై కొబ్బరికాయను పగలగొట్టారు. అయితే ఆ రాయి నుండి రక్తం(blood) రావడంతో ఈ విషయాన్ని వారు స్థానికులకు తెలిపారు. ఈ రాయికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని జ్యోతిష్యులు(Astrologers) చెప్పినప్పుడు, గ్రామస్తులు ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు.

అయితే ఇక్కడ కేవలం ఆడవారు మాత్రమే పూజించడానికి అనుమతించారు(Allowed). కొంతకాలం తరువాత పురుషులు కూడా స్త్రీల వేషంలో గుడికి వెళ్లి పూజలు చేయడం ప్రారంభించారు. కాగా ఉత్సవ వేళ మేకప్ ఆర్టిస్టులు ఆలయ ప్రాంగణం(Temple premises)లో పురుషులకు స్త్రీల తరహాలో అలంకరణ చేస్తారు. కేరళకు చెందిన ఒక పురుషుని స్త్రీ తరహా వస్త్రధారణ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ఈసారి ఈ పండుగ పోటీ టైటిల్‌(Title)ను అతను సొంతం చేసుకున్నాడు.

Updated Date - 2023-03-29T09:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising