Kiara Advani: బాలీవుడ్ హీరోతో పెళ్లి ఫిక్స్.. తేదీ ఎప్పుడంటే..?

ABN, First Publish Date - 2023-02-02T15:54:50+05:30

కియారా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తో డేటింగ్ చేస్తుందని గత కొంత కాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టు సమాచారం అందుతుంది.

Kiara Advani: బాలీవుడ్ హీరోతో పెళ్లి ఫిక్స్.. తేదీ ఎప్పుడంటే..?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ కియారా అడ్వాణీ (Kiara Advani). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తుంది. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసింది. కియారా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తో డేటింగ్ చేస్తుందని గత కొంత కాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టు సమాచారం అందుతుంది.

Sidharth-Malhotra.gif

కియారా అడ్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి ఫిబ్రవరి 6న జరగనున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. రాజస్థాన్‌లో ఈ వివాహం వైభవంగా జరనుందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి దాదాపుగా మూడు రోజుల పాటు జరగనున్నట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఫిబ్రవరి 4, 5న జరగబోతున్నట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి. జై సల్మేర్‌లోని సూర్య గఢ్ హోటల్‌లో ఈ జంట ఏడడుగులు వేయనున్నారట. అతిథుల కోసం విలాసవంతమైన విల్లాలు, స్పెషల్ సూట్స్‌లను బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వివాహానికి బంధువులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, ఆయన భార్య మిరా రాజ్‌ఫుత్ హాజరుకానున్నట్టు సమాచారం అందుతుంది. కియారా అడ్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రా ‘షేర్ షా’ (Shershaah) లో హీరో, హీరోయిన్‌గా నటిచారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. అనంతరం ఆలోచనలు, అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Updated Date - 2023-02-02T15:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising