వివాదాస్పదంగా కిమ్ కుమార్తె లైఫ్ స్టయిల్... ‘మాకు విధించిన ఆంక్షలు ఆమెకు వర్తించవా’ అంటూ జనం ఏం చేస్తున్నారంటే...
ABN, First Publish Date - 2023-03-30T08:22:17+05:30
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) రూపొందించే వింత చట్టాల గురించి ప్రపంచం అంతటికీ తెలిసిందే. దేశంలోని ప్రజల హెయిర్ స్టైల్(Hair style) మొదలుకొని
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) రూపొందించే వింత చట్టాల గురించి ప్రపంచం అంతటికీ తెలిసిందే. దేశంలోని ప్రజల హెయిర్ స్టైల్(Hair style) మొదలుకొని దుస్తులు ధరించడం వరకు పలు నియమాలను నిర్దేశించాడు. తాజాగా అతని కుమార్తె జీవనశైలి(lifestyle) చర్చనీయాంశంగా మారింది. కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జూ(Kim Jr) వయసు 10 సంవత్సరాలు. ఆమె జీవనశైలిని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె చాలా ఖరీదైన(Expensive), ఫ్యాన్సీ దుస్తులను ధరిస్తుంది.
ప్రజల హెయిర్ స్టయిల్ విషయంలో పలు నిబంధనలు విధించిన కిమ్ కుమార్తె విషయంలో దానికి మినహాయింపునిచ్చారు. దీంతో ఆమె తనకు నచ్చిన ఫ్యాషన్ హెయిర్ స్టయిల్‌ను ప్రయత్నిస్తుంది. గుర్రపు స్వారీ(horse riding), స్కీయింగ్, స్విమ్మింగ్ వంటివి నేర్చుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆమె విలాసవంతమైన జీవనశైలి(luxurious lifestyle)ని చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు ఉత్తరకొరియా వాసులు రేడియో ఫ్రీ ఆసియా(Radio Free Asia)లో వెళ్లగక్కారు. అలాగే తమ నియంత కూతురి లైఫ్ స్టైల్ చూసి నోరెళ్లబెడుతున్నారు.
దేశంలోని సామాన్యుల జీవితం కష్టాలలోనే గడిచిపోతోందని ఉత్తర కొరియావాసులు వాపోతున్నారు. అయినా నియంత ప్రజాగ్రహాన్ని పట్టించుకోవడం లేదు. కిమ్ జోంగ్ కుమార్తె ఇటీవల చాలా సందర్భాలలో తండ్రితో పాటు కనిపించింది. ఆమెనే ఉత్తరకొరియా(North Korea) తదుపరి పాలకురాలు కావచ్చని దేశ ప్రజలు భావిస్తున్నారు.
Updated Date - 2023-03-30T08:49:32+05:30 IST