ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chinese Zodiac Sign: చైనా జ్యోతీష్యం ప్రకారం మీ రాశి, మీకు కలిసొచ్చే రంగులు ఏంటో తెలుసుకోండి..

ABN, First Publish Date - 2023-12-09T15:26:38+05:30

ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎన్నో సంస్కృతులు, ఆచార సాంప్రదయాలు ఉన్నాయి. ఒక్కో దేశం, మతం వారు ఒక్కో జ్యోతీష్యాన్ని నమ్ముతారు. అయితే భారతీయ జ్యోతీష్యం తరహాలోనే చైనా జ్యోతీష్యం కూడా అత్యంత పురాతనమైనది. ఈ రెండు జ్యోతీష్య శాస్త్రాల మధ్య కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి.

ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎన్నో సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కో దేశం, మతం వారు ఒక్కో జ్యోతీష్యాన్ని నమ్ముతారు. అయితే భారతీయ జ్యోతీష్యం తరహాలోనే చైనా జ్యోతీష్యం కూడా అత్యంత పురాతనమైనది. ఈ రెండు జ్యోతీష్య శాస్త్రాల మధ్య కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి. భారతీయ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం ఉన్న 12 రాశిచక్ర గుర్తులు సూర్య సంకేతాలు. చైనీస్ జ్యోతీష్య శాస్త్రంలో ఉన్న 12 రాశులను జంతువులతో పోలుస్తారు. చైనా జ్యోతీష్య శాస్త్రంలో పుట్టిన సంవత్సరాన్ని బట్టి రాశిచక్రం ఏర్పడుతుంది.

12 రాశులను సూచించే 60 సంవత్సరాల క్యాలెండర్‌ను చైనీయులు అనుసరిస్తారు. అంటే 2000లో పుట్టిన వ్యక్తి, 2012లో పుట్టిన వ్యక్తి ఒకే రాశిచక్రం కిందకు వస్తారు. మీరు పుట్టిన సంవత్సరం ఆధారంగా చైనీస్ క్యాలెండర్ ప్రకారం మీది ఏ రాశి, మీకు కలిసొచ్చే రంగు ఏంటో ఒకసారి చూద్దాం.


ఎలుక

స్వభావం: వీరు చాలా తెలివైన వారు. లక్ష్యం ఏర్పరుచుకుని కష్టపడి పని చేస్తారు.

పుట్టిన సంవత్సరాలు: 1948, 1960, 1972, 1984, 1996, 2008, 2020

కలిసొచ్చే రంగులు: నీలం, బంగారం, ఆకుపచ్చ

ఎద్దు

స్వభావం: వీరు చాలా నిజాయితీగా, సహనంగా ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటే మారడం కష్టం.

పుట్టిన సంవత్సరాలు: 1949, 1961, 1973, 1985, 1997, 2009, 2021

కలిసొచ్చే రంగులు: తెలుపు, పుసుపు, ఆకుపచ్చ

పులి

స్వభావం: వీరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నమ్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.

పుట్టిన సంవత్సరాలు: 1950, 1962, 1974, 1986, 1998, 2010, 2022

కలిసొచ్చే రంగులు: నీలం, గ్రే, ఆరెంజ్

కుందేలు

స్వభావం: చైనీస్ క్యాలెండర్ ప్రకారం ఈ రాశిచక్రంలో పుట్టిన వారు అదృష్ట వంతులు. వీరు చాలా ప్రేమగా, సంతోషంగా జీవిస్తారు

పుట్టిన సంవత్సరాలు: 1951, 1963, 1975, 1987, 1999, 2011, 2023

కలిసొచ్చే రంగులు: ఎరుపు, పింక్, పర్పుల్, నీలం

డ్రాగన్

స్వభావం: విజయం కోసం విపరీతంగా శ్రమిస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. తెలివైన వారు. ఓపిక తక్కువ

పుట్టిన సంవత్సరాలు: 1952, 1964, 1976, 1988, 2000, 2012

కలిసొచ్చే రంగులు: బంగారు, వెండి రంగు

పాము

స్వభావం: అన్ని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ. నమ్మకంగా ఉంటారు. తెలివైన వారు. లాజికల్‌గా ఆలోచిస్తారు

పుట్టిన సంవత్సరాలు: 1953, 1965, 1977, 1989, 2001, 2013

కలిసొచ్చే రంగులు: నలుపు, ఎరుపు, పసుపు

గుర్రం

స్వభావం: ఇతరులను ఆకర్శించడానికి ప్రయత్నిస్తుంటారు. స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు.

పుట్టిన సంవత్సరాలు: 1954, 1966, 1978, 1990,2002, 2014

కలిసొచ్చే రంగులు: పుసుపు, ఆకుపచ్చ

మేక

స్వభావం: వీరు చాలా శాంతంగా, దయగా ఉంటారు. బద్ధకం ఎక్కువ. లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు.

పుట్టిన సంవత్సరాలు: 1955, 1967, 1979, 1991, 2003, 2015

కలిసొచ్చే రంగులు: బ్రౌన్, ఎరుపు, పర్పుల్

కోతి

స్వభావం: వీరు చాలా తెలివిగా, ప్రతిభావంతంగా ఉంటారు. వీరి అర్థం కాని తత్వం వల్ల వీరిని నమ్మడం కష్టం.

పుట్టిన సంవత్సరాలు: 1956, 1968, 1980, 1992, 2004, 2016

కలిసొచ్చే రంగులు: తెలుపు, నీలం, బంగారం

కోడిపుంజు

స్వభావం: వీరు చాలా సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటారు. ముక్కుసూటిగా, ఇతరుల పట్ల దయతో ఉంటారు.

పుట్టిన సంవత్సరాలు: 1957, 1969, 1981, 1993, 2005, 2017

కలిసొచ్చే రంగులు: బంగారం, బ్రౌన్, పసుపు

కుక్క

స్వభావం: చాలా విశ్వాసంగా, నిజాయితీగా, సరదాగా ఉంటారు. నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తారు

పుట్టిన సంవత్సరాలు: 1958, 1970, 1982, 1994, 2006, 2018

కలిసొచ్చే రంగులు: ఎరుపు, ఆకుపచ్చ, పర్పుల్

పంది

స్వభావం: ఎవరి సహాయం లేకుండా లక్ష్యం వైపు దూసుకెళుతుంటారు. ఇతురులను బాగా అర్థం చేసుకుంటారు.

పుట్టిన సంవత్సరాలు: 1959, 1971, 1983, 1995, 2007, 2019

కలిసొచ్చే రంగులు: పసుపు, గ్రే, బ్రౌన్

Updated Date - 2023-12-09T15:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising