ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR 30: తారక్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో!

ABN, First Publish Date - 2023-02-15T13:20:53+05:30

తన నటన, డిక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తున్ననటుడు జూనియర్ ఎన్‌టీఆర్‌ (Junior NTR). ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన నటన, డిక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు జూనియర్ ఎన్‌టీఆర్‌ (Junior NTR). ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనుంది. పాన్ ఇండియాగా రూపొందనుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మేకర్స్ పలువురితో చర్చలు జరిపారు. ఆ చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. విలన్ పాత్రకు ఎంపిక పూర్తయినట్టు సమాచారం అందుతుంది.

‘ఎన్‌టీఆర్ 30’ లో విలన్ పాత్ర కోసం మేకర్స్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లతో చర్చలు జరిపారు. అయితే, ప్రతినాయకుడిగా నటించేందుకు సైఫ్ అలీఖాన్ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర బృందం నుంచి త్వరలోనే రానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. సైఫ్‌కు కూడా తెలుగులో ఇదే మొదటి చిత్రం. ‘ఎన్‌టీఆర్ 30’ ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలు జరుపుకొనుంది. మార్చి 20 తర్వాత రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందువల్ల ఆయన నుంచి వచ్చే నెక్ట్స్ ప్రాజెక్టు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలను మించి రాణించాలని తారక్ భావిస్తున్నారు. అందువల్ల ‘ఎన్‌టీఆర్ 30’ పై ఏ మాత్రం రాజీ పడటం లేదు. ఈ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఈ మూవీకి ‘దేవర’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కనుంది. అందుకు సంబంధించి రెండు భారీ సెట్స్‌ను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-02-15T13:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising