Kriti Sanon: డబ్ల్యూపీఎల్‌లో బాలీవుడ్ హీరోయిన్ మెరుపులు!
ABN, First Publish Date - 2023-03-02T18:41:55+05:30
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో కృతి సనన్ (Kriti Sanon) ఒకరు. ‘వన్: నేనొక్కడినే’, ‘దోచెయ్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. టాలీవుడ్‌లో నటిస్తున్న సమయంలోనే హిందీ నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో కృతి సనన్ (Kriti Sanon) ఒకరు. ‘వన్: నేనొక్కడినే’, ‘దోచెయ్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. టాలీవుడ్‌లో నటిస్తున్న సమయంలోనే హిందీ నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఫలితంగా అక్కడే చిత్రాలు చేస్తూ స్థిరపడిపోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Womens Premier League)(డబ్ల్యూపీఎల్) ఆరంభ వేడుకల్లో ఈ అందాల భామ ప్రదర్శన ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పలు హిట్ పాటలకు డ్యాన్స్ చేయనున్నట్టు సమాచారం అందుతుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4న ప్రారంభ కానుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వేడుకలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా తాను నటించిన సినిమాల్లోని అనేక హిట్ పాటలకు కృతి సనన్ కాలు కదపనున్నారు. ‘పరమ్ సుందరి’, ‘తుమ్‌కేశ్వరి’ సాంగ్స్‌కు స్టెప్పులేయనున్నారు. మహిళల కోసం నిర్వహించే ఈవెంట్స్‌లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అత్యంత భారీ, ఖరీదైనదిగా పేరు సంపాదించుకుంది.
కృతి సనన్ నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల కానుంది. టైగర్ ష్రాఫ్‌కు జోడీగా ‘గణపత్’ (Ganapath) లోను ఆమె నటిస్తోన్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. షాహిద్ కపూర్‌తోను కృతి ఓ ప్రాజెక్టు చేస్తున్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు
Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని
Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్
Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్
Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!
Updated Date - 2023-03-02T18:41:55+05:30 IST