ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lady Fingers : బెండకాయ నానబెట్టిన నీళ్లను తాగితే ఏం జరుగుతుందో చూడండి..!

ABN, First Publish Date - 2023-02-15T12:26:01+05:30

బెండకాయ మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తోంది. ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు ఈ బెండకాయలో పుష్కలంగా ఉన్నాయి. అయితే బెండకాయను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెండకాయ మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తోంది. ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు ఈ బెండకాయలో పుష్కలంగా ఉన్నాయి. అయితే బెండకాయను నానబెట్టిన నీటిని తీస్కోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా..? అయితే..ఇప్పుడు తెలుసుకుందాం. రక్తహీనత అనేది చాలా మందిని వేధిస్తుంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ వ్యాధి అధికం. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది. దీనికి బెండకాయ నానబెట్టిన నీళ్లను తీసుకుంటే..చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ బెండకాయ వాటర్ తీస్కోవడం వల్ల రెడ్ సెల్స్ పుష్కలంగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా తగినంత హిమోగ్లోబిన్ శాతం ఉత్పతవుతుంది.

బెండకాయ నీరు తగ్గు, గొంతు నొప్పులను తగ్గించేందుకు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. గొంతు వాపు, దగ్గు, గొంతులో దురద వంటి సమస్యలను బెండకాయలో ఉండే యాంటీ సెఫ్టిక్ లక్షణాలు సమర్థవంతంగా ఎదురుకుంటాయి. ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధి కూడా ఉన్నవారికి పెను ముప్పుగా మారింది. వారికి బెండకాయ ఉపయోగపడుతుంది. బెండకాయలో ఇన్సులిన్ ప్రాపర్టీలు అధికంగా ఉంటాయి. ఇవి చక్కర వ్యాధిని నియంత్రించడానికి తొడ్పడతాయి. నానబెట్టిన బెండకాయను తీసుకోవడం వల్ల..రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. అతిసారాన్ని నియంత్రించడంలో కూడా ఈ వాటర్ సహాయపడుతుంది. అతిసారం వల్ల శరీరంలో నుంచి నీరు అధికంగా బయటకు పోతుంది.

అందువల్ల శరీరం డీహైడ్రెషన్ బారినపడుతుంది. నాన పెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. బెండకాయకు నీటిలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇదీ శరీరంలో పేరుకుపోయిన కోలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా గుండెపోటు వంటి సమస్యలను నివారించుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. బెండకాయ రక్తస్థాయిలను కూడా క్రమబద్దీకరిస్తోంది. బెండకాయలను ముక్కలుగా కోసి.. రాత్రంత నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీరును తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి.

Updated Date - 2023-02-15T12:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising