ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lay offs:అమెజాన్, గూగుల్, మెటా బాటలోనే ఇప్పుడు ఇంటెల్.. ఉద్యోగుల తొలగింపునకు ఇంటెల్ నిర్ణయం!

ABN, First Publish Date - 2023-05-09T17:38:35+05:30

ప్రముఖ చిప్ తయారీదారు ఇంటెల్(Intel) కంపెనీ ఉద్యోగుల తొలగింపు(Layoffs)నకు సిద్ధమైంది. ఆర్థిక సంక్షోభం(A Financial Crisis) కారణంగా అమెజాన్, గూగుల్, మెటా కంపెనీల తరహాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ చిప్ తయారీదారు ఇంటెల్(Intel) కంపెనీ ఉద్యోగుల తొలగింపు(Layoffs)నకు సిద్ధమైంది. ఆర్థిక సంక్షోభం(A Financial Crisis) కారణంగా అమెజాన్, గూగుల్, మెటా కంపెనీల తరహాలో వ్యయభారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారో వివరాలు వెల్లడించలేదు.

ఆందోళన కలిగిస్తున్న ఆర్థికమాంద్యం దృష్టిలో ఉంచుకొని తమ వ్యూహాన్ని వేగవంతం చేస్తున్నామని ఇంటెల్ సంస్థ తెలిపింది. బిజినెస్, సంబంధిత రంగాల్లో తొలగింపుల ద్వారా, వివిధ మార్గాల్లో భారం తగ్గించుకునే దిశగా మేం దృష్టి సారించామని ఇంటెల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

నివేదికల ప్రకారం..సెమీ కండక్టర్ల తయారీలో అగ్రగామి అయిన ఇంటెల్.. అయా విభాగాల్లో 20 శాతం ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఇంటెల్ డేటా సెంటర్ క్లయింట్ కంప్యూటింగ్ గ్రూపులు 10 శాతం బడ్జెట్ కోతలను అందుకుంటున్నాయి.. నిర్ణీత ఖర్చులను బట్టి ఇంటెల్ గ్రూపులలో 20 శాతం తొలగించేందుకు సిద్ధమైతున్నట్లు తెలుస్తోంది.’’ అని మార్కెట్ పరిశోధన సంస్థ సెమీఅనాలిసిస్‌లో చీఫ్ అనలిస్ట్ డైలాన్ పటేల్ ట్వీట్ చేశారు.

తమ సంస్థ వ్యయాన్ని 3 బిలియన్లకు తగ్గించుకోవాలని యోచిస్తోందని గతేడాది అక్టోబర్ ఇంటెల్ ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కాలిఫోర్నియాలో సుమారు 500 మంది ఉద్యోగులను ఇంటెల్ తొలగించింది. వాషింగ్టన్ కౌంటిలో ఇంటెల్ గ్రూపుకు దాదాపు 22 వేల మంది ఉద్యోగులున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా వందల సంఖ్యలో ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ప్రభావిత ఉద్యోగులను సముచితంగా చూసేందుకు మేము కట్టుబడి ఉన్నాము" ఇంటెల్ ప్రకటించింది.

Updated Date - 2023-05-09T17:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising