Viral: నా భార్య అలిగింది.. బుజ్జగించాలి.. వైరల్ అవుతున్న యూపీ కానిస్టేబుల్ లీవ్ లెటర్!
ABN, First Publish Date - 2023-01-09T20:33:41+05:30
తన భార్య అలిగిందని, ఆమెను బుజ్జగించేందుకు సెలవు కావాలని కోరుతూ ఓ కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Leave Application of constable gone viral). ఆ కానిస్టేబుల్‌కు గత నెలలో వివాహమైంది.
తన భార్య అలిగిందని, ఆమెను బుజ్జగించేందుకు సెలవు కావాలని కోరుతూ ఓ కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Leave Application of constable gone viral). ఆ కానిస్టేబుల్‌కు గత నెలలో వివాహమైంది. పెళ్లై నెల రోజులు కూడా పూర్తి కాకముందే అతను డ్యూటీ కోసం వెళ్లిపోవడంతో అతడిపై భార్య అలిగింది. అతడు ఫోన్ చేసినా మాట్లాడడం లేదు. దీంతో చేసేది లేక ఆ కానిస్టేబుల్ తన సమస్యను ఉన్నది ఉన్నట్టుగా పై అధికారికి విన్నవించుకున్నాడు (Viral Leave Letter).
మహారాజ్‌గంజ్ జిల్లాలోని నౌత్వానా పోలీస్‌స్టేషన్‌లో గౌరవ్ చౌదరి అనే కానిస్టేబుల్ విధులు నిర్వరిస్తున్నాడు. గత డిసెంబర్లో అతడికి వివాహమైంది. అనంతరం తన భార్యను ఇంటి వద్ద వదిలి వచ్చి, డ్యూటీలో జాయిన్ అయ్యాడు. వారం రోజులు లీవ్ తీసుకుని మళ్లీ వస్తానని భార్యకు చెప్పాడు. అయితే అతడు రాకపోవడంతో ఆమె ఫోన్‌కాల్స్‌కు రెస్పాండ్ అవ్వడం మానేసింది. దీంతో గౌరవ్ తన పరిస్థితిని వివరిస్తూ వారం రోజులు సెలవు కోరుతూ ఉన్నతాధికారికి లేఖ రాశాడు.
వివాహం జరిగి నెల కూడా గడవకముందే భార్యను వదిలి వచ్చాను. దీంతో తను నాపై అలకబూనింది. నేను కాల్ చేసినా నో రెస్పాన్స్. మాట్లాడమని ఆమె తల్లికి ఇచ్చేస్తోంది. ఇంటికి వెళ్లి నా భార్యకు సర్ది చెప్పాలి. దయచేసి నాకు సెలవు ఇవ్వండ
ని గౌరవ్ ఆ లేఖలో పేర్కొన్నాడు. గౌరవ్ సమస్యను అర్థం చేసుకున్న ఏఎస్పీ అతడికి ఐదు రోజుల సెలవు ఇచ్చారు. కాగా, ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.
Updated Date - 2023-01-09T20:33:43+05:30 IST