ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలకు రూ.40 వేల జీతం.. జాబ్‌కు రిజైన్ చేసి ఇదేం పనంటూ ఎన్నోసార్లు వాపోయిన భార్య.. ప్రస్తుతం ఈ భర్త పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2023-02-17T18:58:21+05:30

ఆ యువకుడు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించాడు.. నెలకు రూ.40 వేల జీతం.. భార్యాపిల్లలతో సజావుగా కాలం గడుపుతున్నాడు.. అయితే ఆ జీవితం ఆ యువకుడికి సంతృప్తిని కలిగించలేదు.. ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయాలనుకున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించాడు.. నెలకు రూ.40 వేల జీతం.. భార్యాపిల్లలతో సజావుగా కాలం గడుపుతున్నాడు.. అయితే ఆ జీవితం ఆ యువకుడికి సంతృప్తిని కలిగించలేదు.. ఉద్యోగం మానేసి వ్యవసాయం చేయాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా ఉద్యోగం మానేశాడు.. తన భూమిలో వ్యవసాయం ప్రారంభించాడు.. జాబ్‌కు రిజైన్ చేసినపుడు తిట్టిన భార్య ప్రస్తుతం అతడి విజయానికి సంతోష పడుతోంది.. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సాగర్ జిల్లాకు చెందిన అంకిత్ జైన్ అనే యువకుడి కథ ఇది (Inspirational Story).

సాగర్ జిల్లాకు చెందిన అంకిత్ ఉద్యోగాన్ని వదిలి సంప్రదాయ పద్ధతుల్లో గోధుమలు, సోయాబీన్ సాగు చేయడం ప్రారంభించాడు (Farming). ఆ తర్వాత కొత్తదాన్ని ప్రయత్నించాలనుకుని స్ట్రాబెర్రీ పంట (Strawberry Plants) వేశాడు. సరికొత్త పద్ధుతుల్లో సాగు చేయడం మొదలుపెట్టాడు. మొదటి మూడు సార్లు అతడిని నష్టాలే పలకరించాయి. ఫంగస్ పట్టడం, మొక్కలు సరిగ్గా పెరగక పోవడం, దిగుబడి ఆశినంత రాకపోవడం వల్ల నష్టాలు వచ్చాయి. అయితే ఓడిపోయిన ప్రతిసారి పాఠాన్ని నేర్చుకుని వాటికి పరిష్కారాలు కనుగొన్నాయి. మరోసారి ఆ తప్పు చేయకుండా చూసుకుని స్ట్రాబెరి సాగు గురించి అధ్యయనం చేశాడు.

ఆయనకు 75 ఏళ్లు.. ఆమెకు 65 ఏళ్లు.. ఈ వయసులో పెళ్లేంటని అవాక్కవుతున్నారా..? అసలు వీళ్ల గతమేంటో తెలిస్తే మరింత షాకవుతారు..!

తనకు ఉన్న 5 ఎకరాల్లో 100 మొక్కలు నాటాడు. ఒక్కో పండు బరువు 100 నుంచి 120 గ్రాముల వరకు వస్తోంది. ఒక్కో చెట్టు నుంచి 50 కిలోల కంటే ఎక్కువ బరువున్న స్ట్రాబెర్రీ పంట లభిస్తుంది. వీటితో పాటు అదే పొలంలో సాంప్రదాయ పద్ధతుల్లో సోయాబీన్, ఉల్లి, చెరకు పండిస్తున్నాడు. స్ట్రాబెర్రీ ద్వారా ఏడాదికి దాదాపు రూ.2లక్షల రూపాయల లాభం వస్తోంది. అలాగే ఏడాది పొడవునా వేసే మిగతా పంటల వల్ల రూ.4 లక్షల లాభం వస్తోంది.

Updated Date - 2023-02-17T18:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising