Leftover Rice: మిగిలిపోయిన అన్నంతో మర్నాడు టిఫిన్లు చేసే అలవాటున్న వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది..!
ABN, First Publish Date - 2023-05-03T17:52:33+05:30
మిగిలిన అన్నంతో స్నాక్స్, పులిహోర కలిపే ఆడవాళ్లు దాన్ని ఉపయోగించే మరొక మార్గం గురించి తెలుసుకోవాలి. ఇది మీకు తెలిస్తే అవాక్కవ్వడం గ్యారెంటీ..
రాత్రిపూట భోజనం చేయగానే అన్నం మిగిలిపోవడం చాలా ఇళ్ళలో కామన్ గా జరిగే విషయమే.. అయితే ఇంట్లో ఆడవాళ్లు మరుసటి రోజు ఆ అన్నంతో పులిహోర లేక పిల్లలకోసం ఏదో ఒక స్నాక్ వంటివి చేస్తుంటారు. మరికొందరు ముందురోజే దోశల పిండిలోకి తోసేస్తుంటారు. ఇలా స్నాక్స్, పులిహోర కలిపే ఆడవాళ్లు మిగిలిపోయిన అన్నాన్ని ఉపయోగించే మరొక మార్గం గురించి తెలుసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యం కాదు అందం పెరుగుతుంది. మిగిలిపోయిన అన్నంతో అందం పెరగడమేంటనే డౌట్ వచ్చిందా? అయితే పూర్తీగా తెలుసుకోవాల్సిందే..
అందం మీద దృష్టి ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి కచ్చితంగా బియ్యం పిండితో ఫేస్ ప్యాక్(rice flour face pack) వేసుకుని ఉంటుంది. బియ్యం పిండి మంచి స్క్రబ్ గా పనిచేస్తుంది. అయితే బియ్యం పిండి కాకుండా నేరుగా అన్నాన్ని ఫేస్ ప్యాక్(boiled rice face pack) గా ఎప్పుడైనా ఉపయోగించారా? అన్నంతో ఫేస్ ప్యాక్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి అన్నం చర్మసంరక్షణలో అద్బుతంగా ఉపయోగపడుతుంది. వంటగదిలో ఉండే ఇతర పదార్థాలతో అన్నాన్ని కలిపి ఫేస్ ప్యాక్ గా వేసుకుంటే ముఖం మీద ఉన్న టానింగ్(Tanning), మచ్చలు(Spots), ముడుతలు(wrinkles) తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఖరీదైన క్రీములు, స్క్రబ్ లు వాడకుండా ఇదిగో ఈ మూడు ఫేస్ ప్యాక్ లు ప్రయత్నిస్తే చాలు.. మ్యాజిక్ జరుగుతుంది.
అన్నం దాల్చినచెక్క ఫేస్ ప్యాక్..(Boiled rice, cinnamon face pack)
అరకప్పు వండిన అన్నం(cup of boiled rice), 1టీస్పూన్ గ్లిజరిన్(1tsp glycerine), 2టీ స్పూన్ల దాల్చినచెక్కపొడి(2tsp cinnamon power) కలపాలి. ఇది బాగా స్మూత్ గా అయ్యేలా మిక్స్ చెయ్యాలి. దీన్ని ముఖానికి మెడకు పట్టించి 15నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖచర్మాన్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో ఈ ఫేస్ ప్యాక్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు ముఖాన్ని కడిగిన తరువాత ఎలాంటి మాశ్చరైజర్ రాసుకోవాల్సిన అవసరం(no need moisturizer) ఉండదు. ఎందుకంటే ఇందులోనే సహజంగా ముఖాన్ని మాశ్చరైజ్ చేసే గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి.
అన్నం, గుడ్డు ఫేస్ ప్యాక్..(boiled rice, egg face pack)
రెండు చెంచాల అన్నం(2spoons boiled rice)లో.. ఒక గుడ్డు తెల్లసొన(egg white yolk) కలపాలి. ఇందులో 4నుండి 5చుక్కల గ్లిజరిన్(4to5 drops glycerine)కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిపోయేవరకు ఉండాలి. ఫేస్ ప్యాక్ ఆరిపోయిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు(best anti aging compounds) పుష్కలంగా ఉంటాయి. ఈ ఫేస్ మాస్క్ ను తయారుచేసుకోవడం కూడా సులభమే. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు అప్లై చేస్తూ ఉంటే ముఖ సౌందర్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.
అన్నం, తేనే ఫేస్ ప్యాక్..(boiled rice, honey face pack)
జిడ్డు చర్మం(oil skin) కలిగినవారకి ఈ ఫేస్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్. మూడు స్పూన్ల అన్నం(3spoons boiled rice)లో రెండు స్పూన్ల తేనె(2tsp honey), ఒక స్పూన్ పాలు(1tsp milk) కలపాలి. ఫేస్ ప్యాక్ మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే పచ్చిపాలు(raw milk) కలిపితే మంచిది. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి స్మూత్ గా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20నిమిషాలపాటు ఉంచుకోవాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో ఈ ఫేస్ ప్యాక్ సమర్థవంతంగా పనిచేస్తుంది. డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ ను కూడా తొలగిస్తుంది(remove dark spots, dark circles).
Viral News: పాత ఇంటిని కూల్చేస్తోంటే.. గోడల్లో బయటపడిన రూ.50 లక్షల నోట్ల కట్టలు.. ఆనందంతో ఎగిరిగంతేశాడు కానీ.. చివరకు..
Updated Date - 2023-05-03T17:52:33+05:30 IST