Bengalur: వామ్మో.. ఫ్లాట్ అద్దె నెలకు రూ. 2.5 లక్షలు.. పైగా సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 25 లక్షలట.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన అద్దె ఫ్లాట్!
ABN, First Publish Date - 2023-07-29T13:56:42+05:30
మనం అప్పుడప్పుడు నగరాలలో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయని వింటుంటాం కదా. అయితే, ఇక్కడ చెప్పుకోబోయే ఓ ఫ్లాట్ అద్దె ఎంతో తెలిస్తే మాత్రం మీరు షాక్ అవ్వడం ఖాయం. మరీ ఇంత కాస్ట్లీనా అని కూడా అంటారు.
ఇంటర్నెట్ డెస్క్: మనం అప్పుడప్పుడు నగరాలలో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయని వింటుంటాం కదా. అయితే, ఇక్కడ చెప్పుకోబోయే ఓ ఫ్లాట్ అద్దె ఎంతో తెలిస్తే మాత్రం మీరు షాక్ అవ్వడం ఖాయం. మరీ ఇంత కాస్ట్లీనా అని కూడా అంటారు. కర్నాటక రాజధాని బెంగళూరులో (Bengaluru) ఉందా ఫ్లాట్. నాలుగు బెడ్ రూంలు ఉండే ఆ ఫ్లాట్ అద్దె (Flat Rent) నెలకు ఎంతో తెలుసా? అక్షరాల రూ. 2.5 లక్షలు. అవును మీరు విన్నది నిజమే. ఇక ఇదే ఎక్కువ అనుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ (Security Deposit) కింద ఏకంగా రూ.25 లక్షలు చెల్లించాలట. సోషల్ మీడియా ద్వారా ఈ బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట ఆ అద్దె ఫ్లాట్ హాట్ టాపిక్‌గా మారింది.
'నో బ్రోకర్ యాప్' (No Broker app) లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి తేజస్వి శ్రీవాస్తవా (Tejaswi Shrivastava) అనే నెటిజన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 5,195 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇల్లు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ (HSR Layout) లో ఉందని ఆ నెటిజన్ తెలిపారు. ఇంటి అద్దెనే తల తిరిగేలా చేస్తుంటే.. సెక్యూరిటీ డిపాజిట్ ఇంకా అంతకుమించి అనే చెప్పాలి. దాంతో ప్రస్తుతం నెట్టింట ఈ సెక్యూరిటీ డిపాజిట్ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. అంతేనా.. ప్రకటన కింద 'లోన్ ఆప్షన్' కూడా ఉండటం కొసమేరపు అని చెప్పాలి. అది చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. లోన్ పొందే ఆప్షన్ పక్కనే కిడ్నీ దానానికి సంబంధించి ఆప్షన్ కూడా ఉంటే బాగుండేదంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
Vande Bharat: వందే భారత్ ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. చపాతీ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుడికి వింత అనుభవం.. క్షమాపణలు చెప్పిన రైల్వేశాఖ
Updated Date - 2023-07-29T14:00:41+05:30 IST