ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Funny Video: బర్త్ డే బేబీకి కోపమొచ్చింది.. పక్కనున్న పాపను జుట్టు పట్టుకుని మరీ కొట్టేసింది.. అసలేం జరిగిందో చూస్తే..!

ABN, First Publish Date - 2023-10-07T21:38:09+05:30

బర్త్‌డే కేక్‌పై ఉన్న క్యాండిల్‌ను తన స్నేహితురాలు ఆర్పేయడంతో పుట్టినరోజు జరుపుకుంటున్న ఓ చిన్నారికి కోపం నషాళానికి అంటింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల్లో అమాయకత్వం, కల్లాకపటం తెలీని నిష్కల్మషమైన మనసు ఉంటుందని కాబట్టే వారేం చేసినా చూడటానికి ఎంతో బాగుంటుంది. వాళ్ల అల్లర్లు, అలకలు, నవ్వులు ఇలా అన్నీ అత్యద్భుతంగా కనిపిస్తాయి. అందుకే పిల్లల్ని ఇష్టపడి వారు దాదాపుగా ఉండరు. పిల్లల్ని దైవానికి ప్రతిరూపాలుగా పిలిచేది కూడా అందుకే. అయితే, చిన్నారులకు కూడా అప్పుడప్పుడూ కోపాలు పతాకస్థాయికి చేరుకుంటాయి. అలాంటప్పుడు జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వుతెప్పిస్తుంటాయి. ప్రస్తుతం నెటిజన్లు ఓ చిన్నారి వీడియో(Viral Video) చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. చిన్నారికి చిన్న విషయానికే ఎంత కోపం వచ్చిందో అంటూ బాలికను చూసి ముచ్చటపడిపోతున్నారు.

America: అమెరికాలోని ప్రవాసులకు బిగ్ షాక్.. న్యూయార్క్‌‌లో పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..?


ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ చిన్నారి బర్త్‌డే పార్టీని ఆమె తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. బాలిక స్కూలు స్నేహితులు, చుట్టుపక్కల వారూ అంతా వచ్చారు. చివరకు కేక్ కట్ చేసే టైం రానే వచ్చింది. బాలిక తొలుత ఉత్సాహం క్యాండిల్ ఆర్పేందుకు ముందుకు కదిలించింది. అయితే, పక్కనే ఉన్న మరో బాలిక ఈ చిన్నారికంటే ముందుగా కదిలి క్యాండిల్ ఆర్పేసింది. అంతే, ఈమె కోపం నషాళానికి అంటింది(Birthday girl gets anger after another girls puts off candle on cake).

Viral Video: బాబోయ్.. ఇదేం వింత జీవి..? ఒళ్లంతా జుట్టు.. తల మాత్రమే వెరైటీగా కనిపిస్తూ.. పాములాగా పాకుతూ..!

ఆమె జుట్టుపట్టుకుని లాగుతూ, కొడుతూ అగ్గిమీద గుగ్గిలమైంది. మరోవైపు, ఇదంతా కావాలనే చేశానన్నట్టు మరో బాలిక తీరు ఉండటంతో చిన్నారి మరింత ఆగ్రహానికి లోనైనింది. ఒక్కసారిగా గయ్యిమని ఏడ్చింది. దీంతో, అక్కడున్న వారందరికీ బాలిక కోపం చూసి ముద్దొచ్చి గొల్లున నవ్వారు. చిన్నారి తీరు నెటిజన్లకు కూడా నచ్చడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

NRI Family: అమెరికాలో ఈ ఎన్నారై ఫ్యామిలీకి ఏమైంది..? ఇంత హ్యాపీగా కనిపిస్తున్న వీళ్లంతా తెల్లారేసరికి నిర్జీవంగా..!

Updated Date - 2023-10-07T21:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising