ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Long Hair: మెడిసిన్సూ అక్కర్లేదు, హెయిర్ ప్యాక్ లు వద్దు.. రోజూ ఇవి తాగండి.. జుట్టు పెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు!!

ABN, First Publish Date - 2023-08-27T17:38:19+05:30

జుట్టు సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోవాలన్నా, జట్టు నల్లగా ఒత్తుగా, వేగంగా పెరగాలన్నా కష్టపడక్కర్లేదు. ఇవి తాగితే చాలు మ్యాజిక్కే..

నల్లగా, ఒత్తుగా పొడవాటి జుట్టు కావాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. కానీ నేటి జీవనశైలి కారణంగా జుట్టు పెరుగుదల ప్రశ్నార్థకంగా మారింది. కొందరికి జుట్టు పెరుగుదల ఉండదు, మరికొందరికి చిన్నవయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇది చాలదన్నట్టు హెయిర్ ఫాల్, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు గడ్డిలా పొడిగా ఉండటం. ఇలా జుట్టు సమస్యలు బోలెడు. వీటి పరిష్కారం కోసం చాలామంది వివిధ రకాల షాంపూలు, మెడిసిన్స్, హెయిర్ ప్యాక్ ల మీద ఆధారపడుతుంటారు. కానీ ఇవి తాత్కాలిక పరిష్కారమే ఇస్తాయి. జుట్టు సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోవాలన్నా, జట్టు నల్లగా ఒత్తుగా, వేగంగా పెరగాలన్నా ఈ కింద చెప్పుకునే ఆరోగ్యకరమైన జ్యూస్ లు తాగాలి. రోజూ హాయిగా ఏదో ఒక జ్యూస్ తాగుతూ జుట్టును ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. కేవలం 10రోజుల్లోనే జుట్టు పెరుగుదలలో మార్పు చూసి ఆశ్చర్యపోతారు. జుట్టు పెరుగుదలకు తోడ్పడే జ్యూసులు ఏవో తెలుసుకుంటే..

ప్లం(Plum) లేదా అల్ బుకరా అని పిలుచుకునే ఈ పండు పుల్లగా లేత తియ్యదనం కలిగి ఉంటుంది. సూపర్ మార్కెట్లలో ఈ పండు దొరుకుతుంది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఒక గ్లాసు అల్ బుకరా జ్యూస్ లో 3మి.గ్రా ఐరన్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మెగ్నీషియం, విటమిన్-బి6, విటమిన్-సి కూడా సమృద్దిగా ఉంటాయి. వారంలో ఒకసారి అయినా ఈ జ్యూస్ తాగడానికి ప్రయత్నించవచ్చు. లేదంటే డ్రై అల్ బుకరా మార్కెట్లో దొరుకుతాయి వాటిని అయినా తినచ్చు.

అందరికీ అందుబాటులో ఉండే కూరగాయ బీట్రూట్. బీట్రూల్ జుట్టు వేగంగా పెరగడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఇందులో ఐరన్, ఫోలెట్, విటమిన్-సి ఉంటాయి. ఈ కారణంగా జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు బీట్రూట్ రసాన్ని(beetroot juice) తాగితే రక్తం శుద్ది అవుతుంది, జుట్టు వేగంగా పెరుగుతుంది.

ISRO: ఇస్రో కష్టం ఈనాటిది కాదు.. ఈ 10 ఫోటోలు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్..



ఉసిరికాయ(gooseberry)లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇది విటమిన్-సి కి మంచి మూలం. ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలోనూ, శరీరంలో కణాల డ్యామేజ్ తగ్గించడంలో సహయపడుతుంది. ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటూ ఉంటే జుట్టు రాలడం తగ్గడమే కాదు జుట్టు వేగంగా పెరుగుతుంది. చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటాన్ని(reduce white hair) నివారిస్తుంది.

శరీరానికి చలువ చేయడంలోనూ, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలోనూ కీరదోసకాయ(cucumber) అద్బుతంగా పనిచేస్తుంది. ఇది జుట్టుకు పోషణ అందించి జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. దోసకాయ, పుదీనా, నిమ్మరసం కలిపి బాగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని తాగితే జుట్టు పెరుగుదల బాగుంటుంది.

జుట్టు కుదుళ్ళు అభివృద్ది చెందాలంటే దానికి ప్రోటీన్ అవసరం. అందుకోసం ప్రోటీన్ షేక్(protein shake) తీసుకోవడం తప్పనిసరి. ఇది జుట్టు పెరుగుదలనే కాదు జుట్టు మందంగా, నల్లగా పెరగడంలో కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ షేక్ కోసం బాదం, జీడిపప్పు, పెరుగు, అరటిపండ్లు మ1దలైనవి ఉపయోగించవచ్చు.

అందరికీ అందుబాటులో లభించేవి అరటిపండ్లు(banana). అరటిపండ్లతో షేక్ చేసుకుని తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు పెరుగుదల వేగం పుంజుకుంటుంది. పోషకాహార లోపం పరిష్కారమవుతుంది. నానబెట్టిన బాదం, జీడిపప్పు, అరటిపండు, ఓట్స్, అవిశె గింజలు(కొద్ది మొత్తంలోనే వాడాలి) ఖర్జూరం, పాలు మొదలైనవి మిక్సీలో వేసి మిల్క్ షేక్ తయారుచేసుకుని తాగాలి.

Health Tips: ఈ పండు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కొనేయండి.. ఇంతగా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే..


Updated Date - 2023-08-27T17:38:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising