Guinness Records: గిన్నిస్ ముద్దుల పోటీల్లో మార్పులు.. కారణాలివే..
ABN, First Publish Date - 2023-07-07T18:39:37+05:30
సుదీర్ఘ ముద్దు రికార్డులకు స్వస్తి పలికినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) తాజాగా ప్రకటించింది. ఎందుకంటే పోటీ చాలా ప్రమాదకరమైందని, పోటీకి సంబంధించిన నియమాలు.. గిన్నిస్ ప్రస్తుత నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాలని ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తుంటారు. గిన్నిస్ రికార్డుల్లో అనేక రకాల పోటీలు ఉన్నప్పటికీ ముద్దుల పోటీలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత సుదీర్ఘమైన ముద్దు రికార్డు థాయ్‌లాండ్ (Thailand)కు చెందిన ఓ జంట ఎక్క చాయ్, లక్సానా పేరిట ఉంది.
2013 ఫిబ్రవరిలో వారు ఏకంగా 58 గంటల 35 నిమిషాలపాటు ముద్దుపెట్టుకున్నారు. అయితే ఈ సుదీర్ఘ ముద్దు రికార్డులకు స్వస్తి పలికినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) తాజాగా ప్రకటించింది. ఎందుకంటే పోటీ చాలా ప్రమాదకరమైందని, పోటీకి సంబంధించిన నియమాలు.. గిన్నిస్ ప్రస్తుత నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
కాగా.. లాంగెస్ట్ కిస్సింగ్ రికార్డు నిబంధనల ప్రకారం.. పెదవులు విడిపోకుండా ముద్దు నిరంతరం ఉండాలి. పెదవులు విడిపోతే పోటీకి అనర్హులవుతారు. పోటీలో ఉండగా స్ట్రా ద్వారా మాత్రమే ద్రవపదార్థాలు తీసుకునే అవకాశం ఉంది. పోటీలో ఉన్నంత వరకు కంటెస్టెంట్లు మేల్కొనే ఉండాలి. నిలబడే ఉండాలి.. ఒకరి సాయం ఒకరు తీసుకోకూడదు. విశ్రాంతి సమయం ఉండదు. అడల్ట్ నాపీలు లేదా డైపర్ల వంటి ఇన్‌కంటినెన్స్ ఉపయోగించకూడదు.
అయితే ఈ కఠిన నిబంధనలతో రికార్డులు బద్దలు కొట్టే సమయంలో కంటెస్టెంట్ అనేక ఇబ్బందులపాలయ్యారు. పోటీలో రికార్డు సమయంలో క్రమంగా పెరుగుతుండటంతో పోటీ దారులు నిద్రలేమి, డిప్రెషన్‌కు గురవడం గుర్తించామని గిన్నిస్ వర్గాలు తెలిపాయి. 1999నుంచి నిర్వహిస్తున్న ఈ లాంగెస్ట్ కిస్సింగ్ రికార్డుల్లో జరిగిన కొన్ని ఘటనలను వివరించారు. అయితే లాంగెస్ట్ కిస్సింగ్ రికార్డును గిన్నిస్ ‘లాంగెస్ట్ కిస్సింగ్ మారథాన్’ గా మార్పు చేశారు.
Updated Date - 2023-07-07T18:45:13+05:30 IST