కీబోర్డు ప్రేమ
ABN, First Publish Date - 2023-05-14T08:39:51+05:30
ప్రేమించడం సులువే కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు....
ప్రేమించడం సులువే కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కొందరు ఎర్రగులాబీ ఇచ్చి ‘ఐ లవ్ యూ’ అని తమ ప్రేమను వ్యక్తం చేస్తే, మరికొందరు చాక్లెట్ లేదా ఉంగరం ఇచ్చి ప్రేయసిని సర్‌ప్రైజ్ చేస్తారు. ఇంకొందరు వినూత్నమైన ప్రదేశాల్లో, కార్యక్రమాల్లో ప్రపోజ్ చేస్తారు. ఎటుతిరిగి ప్రేయసి కళ్లలో ఆనందం తళుక్కున మెరిసే ఆ క్షణం కోసం ఎవరైనా జిమ్మిక్కులు చేయాల్సిందే.
ఇప్పటివరకు రకరకాల ప్రపోజల్స్ ఎన్నో చూసుంటారు. కానీ కీబోర్డు ప్రపోజల్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ వినూత్న ఆలోచన ఇటీవల ఓ కుర్రాడికి తట్టింది. ఇంకేముంది... తన ప్రేయసి కోసం ప్రత్యేకించి ఓ కంప్యూటర్ కీబోర్డునే రూపొందించాడు. పాత కంప్యూటర్ బోర్డులోనే కీ బటన్స్‌ను అమర్చి ఆమెకు చెప్పాలనుకున్న విషయాన్ని దాని ద్వారా ప్రజెంట్ చేశాడు. కీబోర్డు బటన్స్‌లో ప్రపోజ్ చేసిన తేదీ, దాని కింద ‘బీ మై గర్ల్‌ఫ్రెండ్ సెయాంగ్’ అనే వాక్యం వచ్చేలా ఇంగ్లీష్ అక్షరాలతో కొన్ని బటన్స్‌ను అమర్చాడు. ఈ వినూత్న ప్రపోజల్‌కు ఆ యువతి ఫిదా అవ్వడమే కాక, ఆనందంతో ఎగిరి గంతేసింది. ‘నా బాయ్ ఫ్రెండ్ చాలా అద్భుతమైన రీతిలో ప్రపోజ్ చేశాడు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నాన’నే క్యాప్షన్‌తో ఆమే స్వయంగా సోషల్ మీడియాలో సదరు కీబోర్డు ఫొటోను పోస్ ్టచేసింది. ఈ క్రియేటివ్ ప్రపోజల్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
Updated Date - 2023-05-14T08:39:51+05:30 IST