ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BirthMarks: పుట్టు మచ్చల వెనుక కథేంటి..? పుట్టినప్పుడు లేని మచ్చలు ఆ తర్వాత ఎలా వస్తాయంటే..

ABN, First Publish Date - 2023-03-27T16:11:18+05:30

అప్పుడప్పుడు మాత్రం ఈ పుట్టుమచ్చలు ఇతర సమస్యలకు దారి తీయొచ్చు. లేదంటే ఇతర వ్యాధులకు సంకేతం కావొచ్చు. జాగ్రత్త పడకపోతే మాత్రం ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది.

పుట్టుమచ్చలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఒక మనిషికి పేరు అనేది ఐడెంటిఫికేషన్. ఎవరైనా పేరుతో పిలిస్తేనే పలుకుతారు. అలాగే పుట్టుకతో వచ్చిన పుట్టుమచ్చలను బట్టి కూడా ఐడెంటిఫికేషన్ చేస్తుంటారు. ఇది వాస్తవం. బర్త్ సర్టిఫికెట్ నుంచి డిగ్రీ సర్టిఫికెట్ వరకు అన్నింట్లో పుట్టుమచ్చల కోసం ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. శరీరంపై ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో రాయాలి. పుట్టు మచ్చలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అసలెందుకీ పుట్టుమచ్చలు ఏర్పడతాయి? ఇంకొందరికీ పుట్టినప్పుడు లేని మచ్చలు ఆ తర్వాత ఎలా వస్తాయి? ఒకవేళ అవి ఏర్పడకపోతే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టా? ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? అసలు ఈ పుట్టుమచ్చల మిస్టరీ ఏంటో తెలుసుకుందాం!?

సహజంగా పుట్టినప్పుడు చర్మంపై ఏర్పడే ఏదైనా గుర్తు లేదా ఆ తర్వాత అభివృద్ధి చెందడాన్ని బర్త్ మార్క్ అంటారు. ఇవి సర్వసాధారణంగా ఏర్పడేవే. చాలా వరకు ఇవి ఎలాంటి హానిచేయవు. కొంత మందికి బిడ్డ పెరిగేకొద్దీ పోతుంటాయి. అప్పుడప్పుడు మాత్రం ఈ పుట్టుమచ్చలు ఇతర సమస్యలకు దారి తీయొచ్చు. లేదంటే ఇతర వ్యాధులకు సంకేతం కావొచ్చు. జాగ్రత్త పడకపోతే మాత్రం కేన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది.

వెంట్రుకల రంగులు చర్మంలో తయారయ్యే 'మెలనిన్' అనే వర్ణక పదార్థం వల్ల ఈ పుట్టుమచ్చలు ఏర్పడతాయి. మెలనిన్ కణాలన్నీ గుంపుగా చర్మం లోపలిపోరలో పేరుకున్నప్పుడు మచ్చలాగా కనిపిస్తాయి. ఇవి పుట్టినప్పటి నుంచి చర్మంపై ఉంటాయి. కాబట్టి వీటిని పుట్టు మచ్చలు అంటారు. కొన్ని పుట్టుమచ్చలు ఉబ్బెత్తుగా కూడా ఉంటాయి. ఇవి లోపలి చర్మంపై ఉండడం వల్ల చెరిగిపోయే అవకాశం ఉండదు. అందుకే వీటిని గుర్తింపు చిహ్నాలుగా (ఐడెంటిఫికేషన్ మార్క్స్) వాడతారు. కొన్ని పుట్టుమచ్చల నుంచి వెంట్రుకలు కూడా పెరుగుతాయి. సాధారణంగా పుట్టుమచ్చల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని పుట్టుమచ్చల పరిమాణం పెరిగి అవకాశం ఉంది. ఇది చర్మక్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది.

ఇక పుట్టుమచ్చలు పుట్టుకతోనే రావాలని లేదు.. కొంత మంది పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఏర్పడుతుంటాయి. పుట్టు మచ్చలు లేనంత మాత్రాన ఆరోగ్య సమస్య కానే కాదు. చాలా మంది పిల్లలు పుట్టుమచ్చలతోనే పుడుతుంటారు. ఇవి శాశ్వతంగా ఉండాలనే లేదు. పెరిగే కొద్దీ ఎప్పుడైనా కనుమరుగు అయ్యే చాన్సుంది. అలాగే కొన్ని పుట్టుమచ్చలు కూడా వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. తల్లికి లేదా తండ్రికి ఎక్కడ పుట్టుమచ్చ ఉందో.. పిల్లలకు అక్కడే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగని అందరికీ రావాలని లేదు. కొన్ని కుటుంబాల్లోనే ఇలా జరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Vijayashanti: సీఎం కేసీఆర్‌పై విజయశాంతి తీవ్ర వ్యాఖ్యల

Updated Date - 2023-03-27T16:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising