Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..
ABN, First Publish Date - 2023-10-10T18:35:17+05:30
తొమ్మిది మంది కుటుంబసభ్యుల్ని తరలించేందుకు ఓ వ్యక్తి ఏకంగా తనబైక్‌కు ఏకంగా ఓ ట్రాలీని జత చేశాడు. అందులో తన పిల్లల్ని ఇతర కుటుంబసభ్యులను కూర్చోబెట్టాడు. పెట్రోల్ కోసం బంక్‌కు వచ్చిన అతడిని చూసి అక్కడి సిబ్బంది షాకైపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యతరగతి వారి కష్టాలు కోకొల్లలు. తెల్లవారిన దగ్గర నుంచీ జీవన పోరాటమే! కానీ ఆ పోరాటమే వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుంది. సరికొత్త శక్తిని ఇస్తుంది. సమస్యలకు తమ పరిధిలోనే సరికొత్త పరిష్కారాలను వెతుకుతూ జీవతాన్ని నెట్టుకొస్తుంటారు. అలాంటి వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral video) మారింది.
ఓ వ్యక్తి తన భార్యాపిల్లలు, ఇతర కుటుంబంతో సహా పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. ఆయనను చూడగానే అక్కడున్న సిబ్బంది ఆశ్చర్యపోయారు. అయితే, వారి ఆశ్చర్యానికి పెద్ద కారణమే ఉంది. ఆ వ్యక్తి తన బైక్ వెనకాల ఓ చిన్న ట్రాలీ తగిలించుకుని వచ్చాడు(Man attackes trolley to bike for transporting family). ఆ ట్రాలీలో పిల్లలతో పాటూ ఇద్దరు, ముగ్గురు ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. మొత్తం తొమ్మిది మంది దాకా ఉన్నారు. ఇదంతా చూసి పెట్రలో బంక్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. పెద్దకారులో కూడా పట్టని తొమ్మిది మందిని అతడు ఓ బైక్ సాయంతో తరలించడం వారిని ఆశ్చర్యపరించింది.
Viral: ఫోన్ చోరీ అయితే పోనీలే అనుకున్నాడు! మరో ఫోన్‌లో కొత్త సిమ్ కార్డు వేశాక భారీ షాక్..!
ఇక ఈ వీడియో నెట్టింట్లో కూడా తెగ హల్‌చల్ చేస్తోంది. భారతీయ మధ్యతరగతి ప్రజల టాలెంట్‌కు ఎవ్వరూ సాటిరారని అనేక మంది కామెంట్ చేశారు. పెద్దసమస్యలను కూడా మనోళ్లు చిట్కాలతో పరిష్కారిస్తారని, ఇది మహాగొప్పగా ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘‘బైక్‌పై వెళ్లేవారికి హెల్మెట్ తప్పనిసరి కదా.. మరి ట్రాలీలో ఉన్న వారికి కూడా హెల్మెట్ పెడతారా? హెల్మెట్ లేకుండా పోలీసులకు చిక్కితే మాత్రం సమస్యలు తప్పవేమో’’ అంటూ మరికొందరు సరదా కామెంట్ చేశారు. ఇలా జనాలను అమితాశ్చర్యాలకు గురిచేస్తూ ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
UP: తల్లి బయటకు వెళ్లేదాకా వెయిట్ చేసి యువతి దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న చెల్లెళ్లను..
Updated Date - 2023-10-10T18:35:20+05:30 IST