ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: దేవుడంటే ఇతడే! బండిపై పళ్లు అమ్ముకుంటున్న వృద్ధురాలికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చాడో తెలిస్తే..

ABN, Publish Date - Dec 16 , 2023 | 09:51 PM

వీధిలో పళ్లు అమ్ముకుంటున్న వృద్ధురాలికి ఓ వ్యక్తి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. బండిపై ఉన్న పళ్లన్నీ తనే కొనేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: రోడ్లపై తోపుడు బళ్ల వాళ్లను ఓసారి చూడండి! పొట్టకూటి కోసం వారు రాత్రనకా పగలనకా, ఎండనకా వాన అనకా ఒళ్లు హూనమయ్యేలా కష్టపడుతుంటారు. కొందరు వృద్ధాప్యంలోనూ ఇలాగే రెక్కలు ముక్కలు చేసుకుంటుంటారు. వారి పరిస్థితి చూస్తే గుండెలు మెలిపెడుతుంటాయి. చాలా మంది ఆ ఆలోచనను పక్కనపెట్టేసి తమ పనిలో నిమగ్నమైపోతారు. అనేక పరిమితుల రీత్యా సాధారణంగా ఇంతకు మించి చేయగలిగిందేమీ ఉండదు. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాడు. దేవుడంటే ఇలాగే ఉంటాడేమో అంటూ నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ( Man Buys Entire Fruit Stock From Elderly Woman).


నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video), ఓ వ్యక్తి పళ్లుకొనుక్కునేందుకు బయటకు వచ్చాడు. అతడికి రోడ్డుపై ఓ వృద్ధురాలు పళ్లబండితో కనిపించింది. ఆమె ముఖంలో విచారం కొట్టొచ్చినట్టు కనిపించడంతో ఆమె వద్దకు వెళ్లి పలకరించాడు. ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్నంతా ఒక్క పండు కూడా అమ్మలేదని వృద్ధురాలు వాపోయింది. ఈ రోజు కూడా రూ.100 మంచి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత ముదిమి వయసులో ఆమె పడుతున్న కష్టం చూసి ఆ వ్యక్తి మనసు కరిగిపోయింది.


ఆమెను ఓదార్చి చేతులు దులుపుకుని వచ్చేసే బదులు వృద్ధురాలికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. బండిపై పళ్లన్నీ తానే కొనబోతున్నట్టు అతడు చెప్పడంతో వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. వెయ్యి చూడటమే గగనమనుకుంటున్న తరుణంలో ఏకంగా రూ.3 వేలు చేతిలో పెట్టి పళ్లన్నీ అతడే కొనుగోలు చేశాడు. కష్టంలో ఉన్న వారికి సాయపడే అవకాశం తనకిచ్చిన భగవంతుడికి కూడా ఆ వ్యక్తి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. దీంతో, అతడిపై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. దేవుడంటే ఇలాగే ఉంటాడేమో అంటూ జానలు ఓ రెంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Dec 16 , 2023 | 09:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising