Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-10-19T22:29:42+05:30
పైపులోని లోప్రెజర్ సమస్యకు ఓ వ్యక్తి వినూత్న పరిష్కారం కనిపెట్టాడు. అసాధ్యంలా కనిపిస్తున్న అతడి ఫీట్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ట్యాంకు నిండా నీళ్లుంటే.. నల్లాల్లోంచి మంచి ప్రెజర్‌తో ధారగా నీళ్లొస్తాయి, లేకపోతే సన్నగా వస్తాయి. ఇది మనందరికీ తెలిసిందే. అంటే, నీళ్ల ట్యాంకు ఎంత ఎత్తులో ఉంది? అందులో ఎన్ని నీళ్లు ఉన్నాయి? వంటి అంశాల ఆధారంగా పైపులో నీటి ఒత్తిడి ఆధారపడి ఉంటుందన్నమాట. కానీ వీటిల్లో మార్పులేమీ లేకుండానే ఓ వ్యక్తి పైపులో అమాంతం ప్రెజర్ పెంచేశాడు. ఓ వాటర్ బాటిల్ సాయంతో అతడు చేసిన ఈ మ్యాజిక్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అతడి వింత టెక్నిక్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.
Viral: ఓవైపు వందేభారత్ రైళ్లు..మరోవైపు ఇలాంటి దారుణాలా? జనాల్లో ఆగ్రహం! అసలేం జరిగిందంటే..
వీడియోలోని వ్యక్తి తాను వాటర్ బాటిల్ సాయంతో పైపులోని ఒత్తిడి పెంచేశానని చెబుతున్నాడు. ముందుగా అతడు పైపు నుంచి నల్లాను వేరు చేశాడు. ఆ తరువాత పైపు ఓ చివర్న బాటిల్‌ను అతికించాడు. ఆ తరువాత పైపునకు కొద్దిగా కింద నల్లాను అమర్చాడు. అయితే, బాటిల్‌ను ఎయిర్ టైట్‌గా అమర్చడంతో ఒత్తిడి పెరిగి నీరు వేగంగా పైపులోకి దూసుకొచ్చిందని చెప్పాడు(Man does amazing trick to increase pressure in the pipe). అసలు ఇదంతా సాధ్యమా లేదా కనికట్టా అన్నది పక్కన బెడితే, వీడియో మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
అతడి టెక్నిక్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో ఇది అసాధ్యమని అంటుంటే మరికొందరేమో అతడి టెక్నిక్ అద్భుతమని నోరెళ్లబెడుతున్నారు. ఇది నిజమో కాదో చెప్పగలిగేతి భౌతిక శాస్త్రవేత్తలు మాత్రమేనని కొందరు చర్చను ముగించే ప్రయత్నం చేశారు. ఇలా రకరకాల కామెంట్ల కారణంగా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Viral: వధువుకు దారుణ అనుభవం.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు వరుడితో కలిసి వెళితే..
Updated Date - 2023-10-19T22:32:11+05:30 IST