Marriage in Hospital: ఆసుపత్రే పెళ్లి మండపం.. రోగులే బంధువులు.. వధూవరుల షాకింగ్ నిర్ణయం!
ABN, First Publish Date - 2023-02-14T13:37:21+05:30
పెళ్లిళ్లు ఇంట్లోనో, గుడిలోనో లేదంటే రిజిస్టర్ ఆఫీసులోనో జరగడం మనం చూసి ఉంటాం.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిళ్లు ఇంట్లోనో, గుడిలోనో లేదంటే రిజిస్టర్ ఆఫీసులోనో జరగడం మనం చూసి ఉంటాం. అయితే, రాజస్థాన్‌లో ఓ పెళ్లి మాత్రం కూసింత వెరైటీగా ఆసుపత్రిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం కోటా జిల్లాలో (Kota) జరిగింది. భావ్‌పూర్ గ్రామానికి చెందిన పంకజ్‌కు రావత్‌భటా గ్రామానికి చెందిన మధు రాఠోడ్‌తో పెళ్లి నిశ్చయమైంది. దాంతో ఇరువురు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, పెళ్లికి ఇంకా ఒక రోజు ఉందనగా వధువుకు చిన్న ప్రమాదం(Aciident) జరిగింది.
దాంతో ఆసుప్రతి (Hospital) పాలైంది. వధువు మెట్లపై కాలు జారిపడడంతో రెండు చేతులు విరిగిపోయాయి. ఆమె తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆస్పత్రిలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. దాంతో వధవు చికిత్స పొందుతున్న వార్డులోనే ఓ రూమ్‌ను బుక్ చేసి అలకంరించారు. వరుడు ఊరేగింపుగా వచ్చి వధువు మెడలో తాళి కట్టాడు. ప్రస్తుతం ఈ పెళ్లి తాలూకు వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కుక్కలకు పెళ్లి...హిందూ సంస్థ వినూత్న నిరసన
Updated Date - 2023-02-14T13:39:55+05:30 IST