ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: సరిగ్గా ఉడకని మష్రూమ్‌లను తిన్నాడో వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-10-20T10:45:55+05:30

ఆరోగ్యవంతంగా ఉండేందుకు సరైన డైట్ ఎంతో అవసరం. కానీ, ఎలాంటి డైట్ పాటించాలో తెలియక ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం. అందుకే మనం తీసుకునే ఆహారం ఎలాంటిదో ముందే చూసుకోవాలనేది డైటీషియన్ల సూచన.

Shocking: ఆరోగ్యవంతంగా ఉండేందుకు సరైన డైట్ ఎంతో అవసరం. కానీ, ఎలాంటి డైట్ పాటించాలో తెలియక ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం. అందుకే మనం తీసుకునే ఆహారం ఎలాంటిదో ముందే చూసుకోవాలనేది డైటీషియన్ల సూచన. ఇక మనం తీసుకునే ఆహారంలో మష్రూమ్‌లను (Mushrooms) తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మష్రూమ్ (పుట్టగొడుగులు) లో ఎన్నో పోషక పదార్థాలు కూడా ఉన్నాయి. పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి వంటి పుట్టెడు పోషకాలు పుట్టగొడుగులలో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మష్రూమ్స్‌ ఆరోగ్యానికి దివ్యౌషధం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇటీవల 72 ఏళ్ల ఓ పెద్దాయన మష్రూమ్స్ తిని అనారోగ్యంతో ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సి వచ్చింది. అవును మీరు విన్నది నిజమే. ఆ వృద్దుడు చేసిన పొరపాటు మష్రూమ్స్‌ను సరిగ్గా ఉడక కుండానే తినడం. దాంతో తీవ్ర చర్మ సమస్య తలెత్తింది. చేసేదేమీలేక ఆస్పత్రిలో చేరాడు.

Viral News: ప్లీజ్ అంటూ వేడుకున్న కస్టమర్.. చెత్త డబ్బాలోంచి ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం తీసి ఇచ్చారంటే..!


ఓ ప్రముఖ ఇంగ్లీష్ జర్నల్‌ ఈ సంఘటనను ప్రచురించింది. ఆ పెద్దాయన గ్యాస్ట్రోనమిక్ అడ్వెంచర్ కోసం తన అన్వేషణలో భాగంగా అనేక తూర్పు ఆసియా వంటకాలలో ప్రధానమైన, మాంసపు రుచికి ప్రసిద్ధి చెందిన షియాటేక్ పుట్టగొడుగుల (Shiitake mushrooms) తో కూడిన ఆహారం తీసుకున్నాడు. అయితే, వృద్ధుడు తిన్న ఆ పుట్టగొడులు సరిగ్గా ఉడకలేవట. అలా వాటిని తిన్న రెండు రోజుల తర్వాత ఒళ్లంతా దద్దుర్లు రావడంతో పాటు దురద మొదలైంది. దాంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లడం జరిగింది. అక్కడ పెద్దాయనను టెస్టులు చేసిన వైద్యులు.. తక్కువ ఉడికించిన పుట్టగొడుగులను తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి అని నిర్ధారించారు. ఇక షియాటేక్ పుట్టగొడుగుల కారణంగా అనారోగ్య సమస్యలను మొదటిసారిగా 1977లో జపాన్‌లో గుర్తించారు. ఆ తర్వాత ఇది ప్రధానంగా ఆసియా అంతటా వ్యాపించింది. అలాగే ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో కూడా కేసులు వెలువడ్డాయని జర్నల్ తన కథనంలో పేర్కొంది.

Crime: పోలీసుల ముందు నిల్చున్న ఇతడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ.. అతడి ఇంట్లో వెతికితే ఏం బయటపడ్డాయో తెలిస్తే..!

Updated Date - 2023-10-20T10:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising