ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: 4 రోజులుగా అదృశ్యం.. సడన్‌గా యజమానికి ఫోన్‌.. మీ పొలంలో ఓ పెట్టెను పూడ్చిపెట్టానంటూ కొత్త ట్విస్ట్.. తవ్వి చూస్తే..!

ABN, First Publish Date - 2023-09-25T15:28:13+05:30

రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఝంఝను జిల్లాలోని లిద్వాలా గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఆదివారం సాయంత్రం అతడు గ్రామంలోని ఓ వ్యక్తికి ఫోన్ చేశాడు. ``మీ పొలంలో నేను ఓ పెట్టెను పూడ్చి పెట్టాను.. వెళ్లి చూడండి..`` అని చెప్పాడు.

రాజస్థాన్‌ (Rajasthan)లోని ఝుంఝును జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఝంఝను జిల్లాలోని లిద్వాలా గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఆదివారం సాయంత్రం అతడు గ్రామంలోని ఓ వ్యక్తికి ఫోన్ చేశాడు. ``మీ పొలంలో నేను ఓ పెట్టెను పూడ్చి పెట్టాను.. వెళ్లి చూడండి..`` అని చెప్పాడు. షాకైన ఆ పొలం యజమాని వెళ్లి తవ్వి చూడగా ఓ పెట్టె కనిపించింది. ఆ పెట్టెలో ఓ బాలుడి మృతదేహం కనిపించింది.. ఆ బాలుడు ఆ ఫోన్ చేసిన వృద్ధుడి మనవడే కావడం సంచలనం రేకెత్తించింది (Crime News).

లిద్వాలా గ్రామానికి చెందిన సురేష్, అతడి భార్య రోష్ణి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అదే గ్రామానికి చెందిన భూపేష్ పొలంలో పని చేస్తుంటారు. నాలుగు రోజుల క్రితం సురేష్ అదృశ్యమయ్యాడు. ఏదో ఊరు వెళ్లి ఉంటాడని అందరూ అనుకున్నారు. ఆదివారం సాయంత్రం యజమాని భూపేష్‌కు సురేష్ ఫోన్ చేశాడు. మీ పొలంలో ఓ పెట్టె పూడ్చి పెట్టానని వివరాలు చెప్పాడు. అనంతరం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. వెంటనే భూపేష్ తన పొలంలోకి వెళ్లి తవ్వి చూడగా ఓ పెట్టె లభ్యమైంది (Grand Father killed grand son).

Viral Video: వామ్మో.. ఇదెక్కడి చోద్యం.. గుర్రంతో సహా మాల్‌లోకి వెళ్లి షాపింగ్ చేసిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో!

ఆ పెట్టెను బయటకు తీసి తెరిచి చూడగా లోపల సురేష్ మనవడి మృతదేహం లభ్యమైంది. షాకైన భూపేష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే మనవడిని సురేష్ ఎందుకు చంపాడో ఎవరికీ తెలియడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2023-09-25T15:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising