ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: భార్య కోసం ఎన్నో త్యాగాలు చేశాడు.. కష్టపడి ఆమెను ఉన్నతోద్యోగిని చేశాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..

ABN, First Publish Date - 2023-06-25T19:24:04+05:30

అతను తన భార్యను ఎంతగానో ప్రేమించాడు.. ఆమె కలలను నెరవేర్చేందుకు రాత్రి, పగలూ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాడు.. రూపాయి రూపాయి పోగేసి భార్య చదువు కోసం ఖర్చు పెట్టాడు.. భార్య బాగా చదువుకుని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్అయింది.. తన కోసం కష్టపడిన భర్తను దారుణంగా మోసం చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను తన భార్యను ఎంతగానో ప్రేమించాడు.. ఆమె కలలను నెరవేర్చేందుకు రాత్రి, పగలూ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాడు.. రూపాయి రూపాయి పోగేసి భార్య చదువు కోసం ఖర్చు పెట్టాడు.. భార్య బాగా చదువుకుని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) అయింది.. ఆ తర్వాత ఆమె తన భర్తను చులకనగా చూడడం ప్రారంభించింది.. తనతో పాటు పనిచేసే మరో అధికారితో వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకుంది.. నిలదీసిన భర్తను వరకట్నం కేసులో ఇరికించి జైలుకు పంపించింది.. బెయిల్‌పై బయటకు వచ్చిన భర్త న్యాయ పోరాటం ప్రారంభించాడు.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అలోక్ మౌర్య అనే వ్యక్తి తన భార్య జ్యోతి ఎదుగుదల కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి సంపాదించిన మొత్తాన్ని భార్య చదువు కోసం వినియోగించాడు. అప్పులు చేసి మరీ ప్రయాగ్‌రాజ్‌లోని మంచి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేశాడు. పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైన జ్యోతి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఉద్యోగం సాధించింది. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది. చిరుద్యోగం చేసే భర్తపై ఆమెకు చులకన భావం మొదలైంది (Wife Cheated Husband).

Viral: వేదిక మీద ఒంటరిగా ఉన్న వధువు.. వరుడు ఎంతకీ రాకపోవడంతో టెన్షన్.. చివరకు అసలు విషయం తెలిసి..

తనతో పాటు పనిచేసే మరో ఆఫీసర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలుసుకున్న అలోక్ భార్యను నిలదీశాడు. దీంతో జ్యోతి తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి జైలుకు పంపించింది. ఇటీవలె అలోక్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. జైలుకు వెళ్లడంతో అతడి ఉద్యోగం పోయింది. అంతేకాదు విడాకులు ఇవ్వాలని కోరుతూ జ్యోతి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. జ్యోతిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అలోక్ తన బాధను మీడియాకు వెల్లడించాడు.

Updated Date - 2023-06-25T19:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising