NRI: కెనడాలో కొడుకు నిర్వాకం.. సొంతూళ్లో ఓ తండ్రికి ఊహించని కష్టం.. 20 మంది వ్యక్తులు వచ్చి దాడి చేస్తే..!
ABN, First Publish Date - 2023-07-18T18:49:31+05:30
కెనడాలో కొడుకు చేసిన పని ఆ తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. కొడుకు చేసిన నిర్వాకానికి ఆ వృద్ధ దంపతులు దాడికి గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్ప వారు ప్రాణహాని నుంచి తప్పించుకోలేకపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన జరగింది.
కెనడా (Canada)లో కొడుకు చేసిన పని ఆ తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. కొడుకు చేసిన నిర్వాకానికి ఆ వృద్ధ దంపతులు దాడికి గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్ప వారు ప్రాణహాని నుంచి తప్పించుకోలేకపోయారు. గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఈ ఘటన జరగింది. అహ్మదాబాద్‌కు సమీపంలోని బిలియా గ్రామానికి చెందిన పంకజ్ పటేల్ అనే వ్యక్తి కొడుకు ప్రిన్స్ మూడు నెలల క్రితం కెనడా వెళ్లాడు. అక్కడకు వెళ్లాక మూడు నెలల్లోనే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.
అహ్మదాబాద్‌కు సమీపంలోని మరో ప్రాంతమైన విజయ్‌పూర్‌కు చెందిన ఆశా పటేల్‌ను కెనడాలో ప్రిన్స్ వివాహం చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి ఆశా కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రిన్స్‌ను ఏమీ చేయలేక అతడి తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డారు. ఆదివారం రాత్రి ఆశా కుటుంబానికి చెందిన 20 మంది వ్యక్తులు నేరుగా పంకజ్ ఇంట్లోకి ప్రవేశించి అతడిపై, అతడి భార్యపై కర్రలతోనూ, పైపులతోనూ దాడి చేశారు. వారి కేకలు విని చుట్టుపక్కల వారు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయాలతో పంకజ్ దంపతులు బయటపడ్డారు (Crime News).
Viral: మేడ మీద ఫ్రెండ్‌తో కలిసి కాఫీ తాగుతోంటే.. ఆకాశంలోంచి ఆ యువతి మీద పడిందో వింత వస్తువు.. అదేంటో తెలిసి..!
సోమవారం ఉదయాన్నే పంకజ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆశా కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. ఆశా కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని, తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
Updated Date - 2023-07-18T18:49:31+05:30 IST