Viral Video: కారులో 15 అడుగుల కింగ్ కోబ్రా.. ఒట్టి చేతులతోనే ఎలా పట్టుకున్నాడో చూడండి..
ABN, First Publish Date - 2023-05-08T15:12:30+05:30
పాములంటే భయపడని వారు ఉండరు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో భారీ సర్పాలు జనావాసాల్లోకి చొరబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
పాములంటే (Snakes) భయపడని వారు ఉండరు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో భారీ సర్పాలు జనావాసాల్లోకి చొరబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతున్నాయి. వాటిని కొందరు భయం లేకుండా పట్టుకుని అటు పాములను, ఇటు జనాలను కూడా రక్షిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది (Snake Videos).
IFS అధికారి Susanta Nanda ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కారులో ఉన్న కింగ్ కోబ్రాను (king cobra) స్థానికులు గమనించారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతడు ఒట్టి చేతులతోనే కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ఆ కోబ్రాను ఓ సంచిలో వేసి బయటకు తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 31 వేల మంది చూశారు. 1100 మంది లైక్ చేశారు.
Viral video: రెండేళ్ల బాబు తన తల్లిని ఎలా మోటివేట్ చేస్తున్నాడో చూడండి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో!
``ప్రకృతి సమతుల్యతను కాపాడే ఆహార గొలుసులో కింగ్ కోబ్రా చాలా ముఖ్యమైనది. ఇక్కడ దాదాపు 15 అడుగుల పొడవున్న ఒక కింగ్ కోబ్రాను రక్షించారు. దానిని తీసుకెళ్లి అడవిలో విడుదల చేశారు. శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్ ద్వారా మొత్తం ఆపరేషన్ జరిగింది. దయచేసి మీ స్వంతంగా ప్రయత్నించవద్దు. వర్షాల కారణంగా కింగ్ కోబ్రాలు జనావాసాల వైపు వస్తాయ``ని సుశాంత నందా ట్వీట్ చేశారు.
Updated Date - 2023-05-08T15:12:30+05:30 IST