Shocking Video: చిన్న పిల్లాడిని ఎత్తుకుని పరుగులు తీసిన తండ్రి.. ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుందనుకుంటే.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ABN, First Publish Date - 2023-11-10T18:22:33+05:30
ఓ తండ్రి తన బిడ్డను ఎత్తుకుని మేరీ మాత విగ్రహం వద్దకు పరిగెత్తికెళ్లిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తల్లీపిల్లల మధ్య బంధం మాటలకందనిదే కానీ తండ్రులు కూడా తమ పిల్లల విషయంలో దాదాపు అంతే శ్రద్ధ చూపిస్తారు. అయితే, తండ్రులు తమ భావాల్ని వ్యక్తీకరించే తీరు కాస్తంత డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్(Viral video) అవుతోంది. బిడ్డలు అందరికంటే ఎత్తులో ఉండాలని కోరుకునే తండ్రులు అందుకోసం ఏ చేసేందుకైనా వెనకాడరని ఇతడు నిరూపించాడు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ ప్రార్థనామందిరంలో ఏదో మతపరమైన కార్యక్రమం జరుగుతోంది. ఆ మందిరమంతా జనాలతో నిండిపోయింది. ఇంతలో ఓ వ్యక్తి తన కొడుకు భుజానికెత్తుకుని ఎదురుగా ఉన్న మేరీ మాత విగ్రహం వైపు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అతడి స్పీడు చూసి బిడ్డకేమైనా అయ్యి ఉంటుందని అందరూ కంగారు పడ్డారు. అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. కానీ, ఆ వ్యక్తి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మేరీ మాత విగ్రహం ఉన్న స్టేజీవైపు దూసుకెళ్లిపోయాడు(Man runs with his child on shoulders towards mother may statue).
Vivek Ramaswamy: నువ్వో చెత్త, నా కూతురి పేరెత్తొద్దు..వివేక్ రామస్వామిపై విరుచుకుపడ్డ అమెరికన్ నేత
అక్కడ, స్టేజీపైన తన కొడుకును ఎక్కించాడు. ఆ తరువాత తను కూడా ఎక్కి, ఆ చిన్నారిని మేరీ మాత విగ్రహం వద్ద నిలబెట్టి మళ్లీ స్టేజీ దిగిపోయాడు. భద్రతా సిబ్బంది అతడిని ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇదంతా చూసిన జనాలు కన్‌ఫ్యూజ్ అయిపోయారు. అంత ఇంత హడావుడి చేసింది ఎందుకో ఎవరికీ అంతుబట్టలేదు. ఈ వీడియో నెటిజన్లనూ తికమక పెడుతోంది. అయితే, కొందరు మాత్రం సరదా కామెంట్లతో నవ్వు పుట్టించే ప్రయత్నం చేశారు. బిడ్డ అల్లరి తట్టుకోలేక అతడు దేవుడిచ్చిన కొడుకును దేవుడికే అప్పగించేశాడంటూ కామెంట్ చేశారు. తన బిడ్డే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండాలనుకుని ఇలా చేసుంటాడని మరికొందరు చెప్పుకొచ్చారు.
NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట
Updated Date - 2023-11-10T18:22:36+05:30 IST